ఇళయరాజా తొలిసారిగా..! | ilayaraja going to perform live musical concert in telugu | Sakshi
Sakshi News home page

ఇళయరాజా తొలిసారిగా..!

Sep 7 2017 1:58 PM | Updated on Sep 17 2017 6:32 PM

ఇళయరాజా తొలిసారిగా..!

ఇళయరాజా తొలిసారిగా..!

సౌత్ స్టార్ మ్యూజీషియన్ ఇళయరాజా తొలిసారిగా భాగ్యనగరంలో తొలి సారిగా లైవ్ షో చేయనున్నారు.

సౌత్ స్టార్ మ్యూజీషియన్ ఇళయరాజా తొలిసారిగా భాగ్యనగరంలో తొలి సారిగా లైవ్ షో చేయనున్నారు. ప్రస్తుతం సెలెక్టివ్ గా సినిమాలో చేస్తున్న ఈ సంగీత బ్రహ్మా దేశ విదేశాల్లో మ్యూజిక్ కన్సర్ట్ లలో పాల్గొంటున్నారు. అయితే తొలిసారిగా ఆయన నవంబర్ 5న తెలుగు నేల మీద తెలుగులో సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. గచ్చిబౌలిలోని అథ్లెటిక్ స్టేడియంలో 85మంది టీం సభ్యులతో కలిసి భారీ మ్యూజికల్ కన్సర్ట్ ను ప్లాన్ చేస్తున్నారు.

నవంబర్ 5 సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఈ షో నిర్వహించనున్నారు. తనని దక్షిణాది ప్రజలంతా ఎంతో అభిమానిస్తారన్న ఇళయరాజా తొలిసారిగా తెలుగులో ప్రదర్శన ఇవ్వటం ఎంతో ఆనందంగా ఉందన్నారు.  ఈ షో లో ఇళయరాజాతో పాటు ప్రముఖ గాయకులు మనో, చిత్ర,  కార్తీక్, సాధనా సర్గమ్ మరి కొంత మంది యువ గాయకులు, వాయిద్య కళాకారులు పాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement