హైదరాబాద్ బాటలో బాలీవుడ్, ఇతర పరిశ్రమల సింగర్లు
మ్యూజిక్ డెస్టినేషన్‌గా మారుతున్న భాగ్యనగరం
ఉత్తరాదితో సమాన స్థాయిలో నగరం
కీలక పాత్ర పోషిస్తున్న ఈవెంట్ ఆర్గనైజర్లు
ఈ నెలలోనే 4 నుంచి 5 మెగా కన్సర్ట్స్
నగరవాసుల కళాభిరుచిలో సంగీతం ఏనాటి నుంచో ఇమిడిపోయి ఉంది. అందుకే నగరంలో ఐటీ, స్పోర్ట్స్, ఫ్యాషన్, సినిమా ఎంతో ఫేమస్.. ఇటీవల వాటికి సరి సమానంగా సంగీతం కూడా కొనసాగుతోంది. వీకెండ్స్ అంతా సిటీలో లైవ్ మ్యూజిక్ ఈవెంట్స్, ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్స్ ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. వీటికి తోడు నెలలో కనీసం ఒకటి రెండు అయినా పెద్ద మ్యూజిక్ కన్సర్ట్స్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే కొన్ని రోజుల క్రితమే గచి్చ»ౌలి స్టేడియం వేదికగా జరిగిన దేవిశ్రీప్రసాద్ లైవ్ మ్యూజిక్ షో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. గచి్చ»ౌలి వంటి స్టేడియంలో ఈ షో నిర్వహించినప్పటికీ టికెట్స్ దొరకక ఎంతోమంది బయట ఉండిపోయారు.
నగరంలో ఈ తరహా సంగీత షోలకు అంతటి ఆదరణ ఉంది. గతంలో ఎల్బీ స్టేడియం వేదికగా ప్రముఖ బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ నిర్వహించిన లైవ్ మ్యూజిక్ షో పరిస్థితి అంతే. కొన్ని నెలల క్రితం శిల్పకళా వేదికగా ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత నిర్వహించిన సంగీత కచేరీతో హాల్ మొత్తం నిండిపోయింది. సిటిజనుల ఈ సంగీత అభిరుచికి అనుగుణంగా మరికొందరు అతిపెద్ద ప్రదర్శనలకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సంగీత ప్రదర్శనలో యువత అమితాసక్తితో పాల్గొంటున్నారు.
చిత్రాంజలి.. స్వరాలు
నగరంలో పెరిగుతున్న ఈ మ్యూజిక్ కల్చర్‌కు అనుగుణంగా ఈ నెలలో పలు అతిపెద్ద ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ప్రముఖ సింగర్ ప్రతీక్ కుహాద్ పాప్, రొమాంటిక్ పాటలతో భారీ మ్యూజిక్ షో నిర్వహించనున్నారు. నగరంలోని లునో లాంచ్ బార్ అండ్ కిచెన్ వేదికగా ప్రముఖ టాలీవుడ్ సింగర్ గీతామాధురి ఆధ్వర్యంలో లైవ్ మ్యూజిక్ షో ప్లాన్ చేశారు.
ఇందులో బాలీవుడ్ ఫోక్ రీజినల్ ఫ్యూజన్ పాటలతో సంగీత ప్రియులను అలరించనున్నారు. అంతే కాకుండా ప్రిజం పోడియం వేదికగా తాయిక్కుడం బ్రిడ్జి హైదారాబాద్ పేరుతో ఎలక్ట్రిఫయ్యింగ్ మ్యూజిక్ తో ఫోక్, ఇండియన్ పాప్, రాక్ మ్యూజిక్ షో జరగనుంది. ఇవే కాకుండా డిసెంబర్‌లో శిల్పకళా వేదికగా ఇండియన్ సింగింగ్ సెన్సేషన్ ఫీహు అండ్ ఆవిర్భవ్ లైవ్ షో జరుగుతుంది. ఈ షో కోసం నగర వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే వేదికగా చిత్రామృతం పేరుతో ప్రముఖ సింగర్ చిత్ర లైవ్ పాటల సందడి జరగనుంది. అయితే బుక్ మై షో వేదికదా ఈ షోలకు సంబంధించిన టికెట్స్ ఇప్పటికే హౌస్ ఫుల్ అయిపోవడం విశేషం.
మ్యూజిక్ లవర్స్ కోసమే.. ఈ మ్యూజిక్ కన్సర్ట్
కల్చర్ పాశ్చాత్యంగా నార్త్ ఇండియాకు వచి్చనప్పటికీ.. దీనిని అందిపుచ్చుకోవడంలో హైదారాబాద్ ముందుంది. గతంలో ఇయర్ ఎండ్ వేడుకల్లో, హోలీ సంబరాల్లో ఇతర ప్రత్యేక సందర్భాల్లో మ్యూజిక్ ఫెస్ట్‌లు ఎక్కువగా జరిగేవి. కానీ ప్రస్తుతం.. కేవలం సంగీత ప్రియులను అలరించడం కోసమే ఈ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఈవెంట్ ఆర్గనైజర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకూ సిటీలో దివంగత ఎస్పీ బాల సుబ్రమణ్యం, ఇళయరాజా, డీఎస్పీ, సునీత, కార్తీక్ తదితర దక్షిణాది మ్యూజిక్ స్టార్ల ఈవెంట్లు మంచి ఆదరణ పొందాయి.
ప్రతీక్ సంగీత ప్రదర్శన.. 8న
ప్రముఖ ఫోక్–పాప్ గాయకుడు, పాటల రచయిత రాజస్తాన్‌కు చెందిన ప్రతీక్ కుహాడ్ నగరానికి వస్తున్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఆయన ఈనెల 8వ తేదీన ప్రదర్శన ఇవ్వనున్నారు.
ఐ ట్యూన్స్ ఇండియన్ ఇండీ ఆల్బమ్ ఆఫ్
ది ఇయర్, బెస్ట్ ఇండియన్ యాక్ట్ ఎట్ ది ఎంటీవీ యూరప్ మ్యూజిక్ అవార్డ్స్ వంటి పురస్కారాలు అందుకున్న ఘనత ప్రతీక్ సొంతం. ఆయన ప్రదర్శన రాత్రి 6 గంటల నుంచి 10గంటల వరకూ కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment