షో టాపర్‌గా సింధు అదరహో | PV Sindhu Showstopper for Designer Shriya Bhupal | Sakshi
Sakshi News home page

శ్రియా భూపాల్‌ కోసం షో టాపర్‌గా మారిన సింధు

Published Sat, Aug 31 2019 12:03 PM | Last Updated on Sat, Aug 31 2019 12:28 PM

PV Sindhu Showstopper for Designer Shriya Bhupal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మరి కొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాలు పండుగలు, వివాహ వేడుకలతో బిజీగా మారతాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ శ్రియా భూపాల్‌ ‘శాంక్చురి’ పేరుతో కొత్త కలెక్షన్‌ను పరిచయం చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో ఫ్యాషన్‌ షో నిర్వహించారు. ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణీ పీవీ సింధు షో టాపర్‌గా వ్యవహరించారు.  ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన తర్వాత స్వస్థలంలో సింధు పాల్గొన్న తొలి బహిరంగ కార్యక్రమం ఇదే కావడం విశేషం. ఈ వేడుకలో సింధు పింక్‌ కలర్‌ హాఫ్‌ షోల్డర్‌ జాకెట్‌, అదే కలర్‌ స్కర్ట్‌తో పూబాలగా కనువిందు చేశారు. సింధు, శ్రియా భూపాల్‌ ఇద్దరు చిన్ననాటి మిత్రులు. ఈ పరిచయం మేరకు సింధు షోటాపర్‌గా వ్యవహరించారు.

ఇక తన నూతన కలెక్షన్‌ గురించి శ్రియా భూపాల్‌ మాట్లాడుతూ.. ‘పెళ్లి, పండుగలు వంటి వేడుకల సందర్భంగా ధరించడానికి వీలుగా సంప్రదాయ, సమాకాలీన శైలులకు సంబంధించిన దుస్తులను రూపొందించాను. ఈ పండుగల సీజన్‌ కోసం తేలికపాటి, మృదువైన, ఆహ్లాదకరమైన వస్త్రశ్రేణిని పరిచయం చేస్తున్నాను’ అని తెలిపారు. ఈ కార్యక్రమానికి నమ్రతా శిరోద్కర్‌, సానియా మీర్జా కూడా హాజరయ్యారు.


(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement