
లబ్బీపేట (విజయవాడ తూర్పు) : పిల్లి ఎదురొస్తే మంచిది కాదని.. అపశకునమని భావిస్తారు. కానీ, పిల్లులను కూడా కన్నపిల్లలుగా చూసుకునే వారూ ఉంటారని శనివారం నగరంలో జరిగిన క్యాట్ ఫ్యాషన్ షో నిరూపించింది. బందరురోడ్డులోని పీవీపీ మాల్‌లో జరిగిన ఈ షోలో పెంపుడు పిల్లులకు అందమైన దుస్తులు, జ్యూయలరీ అలంకరించి ఫ్యాషన్ షోకు తీసుకొచ్చారు. డీజే పెర్షియన్, మిశ్య్, పెర్షియన్, కిత్తేన్స్, పెర్షియన్, బ్రౌనీ, టర్కిష్, స్నూఫీ, రోజీ, పారు జాతి పిల్లులతో పాటు బ్రౌన్, వైట్, బ్లాక్, క్రీమ్, మల్టీ కలర్స్ పిల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో మాల్ మేనేజర్ అజయ్, నిర్మలా శ్రీనివాస్, సింధుమాధురి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment