లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అత్యవసర సేవలు మినహా అన్ని సంస్థలు మూతపడటంతోపాటు ప‍్రజలంతా ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఇళ్లల్లో ఉంటున్న వారికి ఎంటైర్‌టైన్‌మెంట్ విషయంలో ఎలాంటి లోటు ఉండటం లేదు. సోషల్ మీడియాలో అనేక వినోధాత్మక కార్యక్రమాలు పుట్టుకొస్తున్నాయి. బోరింగ్ సమయాన్ని సరాదాగా మలుచుకునేందుకు అనేక మంది కొత్త దారులు వెతుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు విచిత్ర వేషధారణతో ఫ్యాషన్ షోను నిర్వహిస్తూ అందరిని ఆకట్టుకునేందకు ప్రయత్నిస్తున్నారు. లాక్‌డౌన్‌లో ఉన్న ప్రజలకు బోలెడంతా వినోదాన్ని పంచుతున్నారు.
(ఈ చిత్రంలో ఎన్ని పులులు ఉన్నాయి? )
నార్త్ కరోలినాకు చెందిన అలక్స్ జేమ్స్, కెల్టన్ ఎడ్వర్డ్స్ అనే ఇద్దరు వ్యక్తులు ఇంట్లోనే ‘క్వారంటైన్ ఫ్యాషన్ వీక్ 2020’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇందుకు గృహ వస్తువులైన దుప్పట్లు, కర్టెన్లు, బెడ్‌షిట్లు, టవల్స్‌ను విభిన్న రకాలుగా ఒంటిపై ధరించి వినూత్నంగా ఫ్యాషన్ షోను నిర్వహిస్తున్నారు. ఈ వీడియోలను తమ ట్విటర్, ఫేస్‌బుక్, టిక్‌టాక్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తున్నారు. మొదటి పార్ట్ వీడియోకు 3.5 మిలియన్లు వ్యూవ్స్ వచ్చాయి. వీటిని చూసిన నెటిజన్లు అలక్స్, ఎడ్వర్డ్‌ల చమత్కారాన్ని అభినందిస్తున్నారు. వావ్ వాట్ ఏ ఫ్యాషన్ షో అంటూ కామెంట్ చేస్తున్నారు.
(‘మీరు నామినేట్ అయ్యారని మరిచిపోకండి’ )
Comments
Please login to add a commentAdd a comment