Mahesh Babu Goa Vacation : సూపర్ స్టార్ మహేశ్ బాబు పక్కా ఫ్యామిలీ మెన్ అన్న సంగతి తెలిసిందే. షూటింగులతో ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన ఏ మాత్రం సమయం దొరికినా కుటుంబంతో గడపడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రస్తుతం మహేశ్ నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ గోవాల్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మహేశ్ తన ఫ్యామిలీని తీసుకొని గోవాకు వెకేషన్ ట్రిప్‌కు వెళ్లారు.
ఓ వైపు సినిమా షూటింగ్‌లోనే పాల్గొంటూనే మరోవైపు కుటుంబంతో సరదాగా గడపనున్నారు. చార్టర్డ్ ఫ్లైట్‌లో వీరంతా గోవాకు వెళ్లినట్లు తెలుస్తుంది. మహేశ్ కుటుంబంతో పాటు నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కుటుంబం కూడా ఈ ట్రిప్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
'నాన్నతో ఫైట్ జర్నీ ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. కేక్స్‌తో పాటు అద్భుతమై గూడీస్ పొందవచ్చు' అంటూ సితార తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేశ్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment