
కేపీహెచ్‌బీకాలనీ : సెల్‌ఫోన్‌లో యువతి పేరుతో చాటింగ్ చేసిన ఓ యువకుడు ఓ మహిళ న్యూడ్ ఫొటోలను సేకరించి బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ రాజుయాదవ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ బెంజిసర్కిల్‌కు చెందిన నందిమల్ల గోపి నగరానికి వలసవచ్చి సూరారం కాలనీలో ఉంటూ ఫ్యాబ్రికేషన్ వర్కు చేస్తున్నాడు. ఇతరుల పేర్లతో తీసుకున్న సిమ్‌కార్డుల ఆధారంగా యువతి పేరుతో నిజాంపేట రోడ్డుకు చెందిన పేరిచర్ల శ్రీనివాసరాజుతో చాటింగ్ చేశాడు.
సదరు యువతి నగ్న ఫోటోలను పోస్ట్ చేసి శ్రీనివాసరాజుతో కూడా అతని ఫొటోలను పోస్ట్ చేయించాడు. అనంతరం శ్రీనివాసరాజును బెదిరించి రూ.4.5 లక్షలు వై. రాణి అనే మహిళ అకౌంట్‌లో జమచేయించుకున్నాడు. అయినా బ్లాక్‌మెయిలింగ్ ఆపకపోగా రు.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.1.60 లక్షల నగదు, బైక్, రెండు సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.