
పార్క్‌లో యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం ఓ గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వసంతనగర్ పార్క్‌లో చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు.
ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.