ఎల్కేజీ విద్యార్థిని చితకబాదిన టీచర్ | teacher canes lkg student in hyderabad | Sakshi
Sakshi News home page

ఎల్కేజీ విద్యార్థిని చితకబాదిన టీచర్

Published Sat, Jul 19 2014 11:46 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 AM

ఎల్కేజీ విద్యార్థిని చితకబాదిన టీచర్

ఎల్కేజీ విద్యార్థిని చితకబాదిన టీచర్

తరగతి గదిలో తెలుగు మాట్లాడినందుకు పిల్లలను చితకబాదిన సంఘటనను ఇంకా రాజధాని వాసులు మర్చిపోకముందే కూకట్పల్లి ప్రాంతంలో అలాంటిదే మరో సంఘటన జరిగింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని వికాస్ భారతి పాఠశాలలో హోంవర్క్ చేయలేదని ఎల్కేజీ చదువుతున్న ఓ విద్యార్థిని టీచర్ చితకబాదేశారు. దాంతో ఆ చిన్నారికి కంటిమీద గాయం అయ్యింది.

ముందురోజు ఇచ్చిన హోం వర్కును ఎందుకు చేయలేదంటూ టీచర్ కొట్టినట్లు విద్యార్థి, ఇతర విద్యార్థులు కూడా చెప్పారు. తాము అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లలను ఇలా గాయాలయ్యేలా కొడతారా అంటూ విద్యార్థి తల్లిదండ్రులు, మరికొందరు వికాస్ భారతి పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement