caning
-
పిల్లలు ఫిర్యాదు చేయగానే... టీచర్ల అరెస్టు కూడదు
కొచ్చి: ఉపాధ్యాయులు, ఇతర బోధన సిబ్బందిపై ఫిర్యాదుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగానే నేరుగా టీచర్ల అరెస్టు వంటి చర్యలకు దిగొద్దు. ప్రాథమికంగా దర్యాప్తు చేసి, నేరం జరిగినట్టు రుజువయ్యాకే చర్యలు తీసుకోవాలి’’ అని పోలీసులను ఆదేశించింది. ఈ దిశగా తక్షణం సర్క్యులర్ జారీ చేయాల్సిందిగా డీజీపీకి ఆదేశాలు జారీచేసింది. విద్యార్థులు స్కూళ్లలోకి ఆయుధాలు, మద్యం, డ్రగ్స్ తదితరాలను యథేచ్ఛగా తీసుకెళ్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తప్పనిసరని న్యాయమూర్తి జస్టిస్ పి.వి.కున్హికృష్ణన్ అభిప్రాయపడ్డారు. విద్యార్థిని బెత్తంతో కొట్టిన కేసులో ఓ టీచరుకు ఆయన ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. కేరళలో విద్యార్థులు, యువత ప్రవర్తన చాలా ఆందోళనకరంగా ఉందని ఈ సందర్భంగా ఆవేదన వెలిబుచ్చారు. ‘‘వారు తీవ్ర నేరాలకు కూడా పాల్పడుతున్నారు. టీచర్లనే బెదిరిస్తున్నారు. వారిని ఘెరావ్ చేస్తున్నారు. భౌతిక దాడులకు దిగుతున్నారు. దీనికి తక్షణం అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంది’’ అన్నారు. క్లాసురూముల్లో బెత్తం పట్టుకునేందుకు టీచర్లను అనుమతించాలని అభిప్రాయపడ్డారు. ‘‘ప్రతిసారీ బెత్తం వాడాలని కాదు. అది టీచర్ల చేతిలో ఉంటే చాలు, తప్పు చేసేందుకు విద్యార్థులు జంకుతారు. తప్పు చేసిన విద్యార్థులకు టీచర్లు చిన్నపాటి శిక్ష విధించాలి. అది నేరమేమీ కాదు. పైగా అంతిమంగా మన విద్యావ్యవస్థ మరింత బలోపేతమయ్యేందుకు తోడ్పడుతుంది. కానీ బాగుపడాలనే సదుద్దేశంతో గిల్లినా, గిచ్చినా, మందలించినా టీచర్లపై క్రిమినల్ కేసులు పెడుతున్నారు. దీన్నుంచి వారికి రక్షణ కల్పించాలి. లేదంటే పని చేయలేరు’’ అన్నారు. ‘‘టీచర్లంతా సాధుసత్తములని చెప్పడం లేదు. వాళ్లలోనూ కొందరు చెడ్డవాళ్లు ఉండవచ్చు. కానీ విద్యార్థిని మనిషిగా తీర్చిదిద్దడంలో టీచర్లది కీలక పాత్ర అని మర్చిపోవద్దు’’ అన్నారు. -
అంధ విద్యార్థులపై కర్కశత్వం
అల్లరి నెపంతో ముగ్గురిని తీవ్రంగా కొట్టిన ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ నిందితులకు దేహశుద్ధి చేసిన బాధితుల బంధువులు, వివిధ సంఘాల ప్రతినిధులు సాక్షి, కాకినాడ (తూర్పు గోదావరి జిల్లా): అసలే బాలలు.. ఆపై అంధులు.. తెలిసీ తెలియక ఓ తప్పు చేశారేమో... పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ రెచ్చిపోయారు... అంధ విద్యార్థులపై అమానుషంగా దాడి చేశారు... వదిలేయమని ప్రాధేయపడుతున్నా పట్టించుకోకుండా చావబాదారు... ఒక విద్యార్థిపై కూర్చుని రాక్షసంగా ప్రవర్తించారు... ఈ దారుణాల్ని రహస్యంగా సెల్ఫోన్లో చిత్రీకరించిన ఒక వ్యక్తి మీడియాకు అందజేయడంతో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి, ప్రజాసంఘాల ప్రతి నిధులు స్కూల్‌కు వెళ్లి కరస్పాండెంట్‌కు, ప్రిన్సిపాల్‌కు దేహశుద్ధి చేశారు. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. సంబంధిత ప్రిన్సిపాల్, కరస్పాండెంట్లపై కఠిన చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని జాతీయ బాలల హక్కుల కమిటీ కోరింది. ఇది చాలా దారుణమైన చర్యని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కుషాల్ సింగ్ ఆందోళన వ్యక్తంచేశారు. పోలీసులు, విద్యార్థుల కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంస్థలు, విదేశీ విరాళాలతో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేట జంక్షన్ వద్ద కె.వి.రావు గ్రీన్‌ఫీల్డ్స్ అంధుల ఆశ్రమ పాఠశాలను నిర్వహిస్తున్నాడు. ఈ సంస్థకు కె.వి.రావు కరస్పాండెంట్‌గా, శ్రీనివాస్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ అంధులే. ఈ నెల 18న విద్యార్థులు సాయి (9), సురేంద్రవర్మ (12), జాన్సన్ (13) అల్లరి చేశారని ఆగ్రహించిన కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ వారిని బెత్తంతో తీవ్రంగా కొట్టారు. ఒక విద్యార్థిపై కూర్చుని రాక్షసంగా ప్రవర్తించారు. ఈ దారుణాల్ని రహస్యంగా సెల్ఫోన్లో చిత్రీకరించిన ఒక వ్యక్తి మీడియాకు సోమవారం అందజేశాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి, ప్రజాసంఘాల ప్రతినిధులు పాఠశాలకు వెళ్లి కరస్పాండెంట్‌కు, ప్రిన్సిపాల్‌కు దేహశుద్ధి చేశారు. కలెక్టర్ నీతూ ప్రసాద్, జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.శ్రీనివాసులురెడ్డి పాఠశాలను సందర్శించారు. ఈ సంఘటనపై ఎంఈవోను విచారణాధికారిగా నియమించినట్లు డీ ఈవో తెలిపారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఎంఈవో ఫిర్యాదు మేరకు తిమ్మాపురం పోలీసులు కేసు నమోదుచేసి రావు, శ్రీనివాస్‌లను అరెస్టు చేశారు. ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ల చేతుల్లో గాయపడిన సాయి, సురేంద్రవర్మ, జాన్సన్‌లను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. -
అంధులను గొడ్డులా బాదేసిన కరస్పాండెంట్
-
ఎల్‌కెజి విద్యార్ధిని చితకబాదిన టీచర్
-
ఎల్కేజీ విద్యార్థిని చితకబాదిన టీచర్
తరగతి గదిలో తెలుగు మాట్లాడినందుకు పిల్లలను చితకబాదిన సంఘటనను ఇంకా రాజధాని వాసులు మర్చిపోకముందే కూకట్పల్లి ప్రాంతంలో అలాంటిదే మరో సంఘటన జరిగింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని వికాస్ భారతి పాఠశాలలో హోంవర్క్ చేయలేదని ఎల్కేజీ చదువుతున్న ఓ విద్యార్థిని టీచర్ చితకబాదేశారు. దాంతో ఆ చిన్నారికి కంటిమీద గాయం అయ్యింది. ముందురోజు ఇచ్చిన హోం వర్కును ఎందుకు చేయలేదంటూ టీచర్ కొట్టినట్లు విద్యార్థి, ఇతర విద్యార్థులు కూడా చెప్పారు. తాము అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లలను ఇలా గాయాలయ్యేలా కొడతారా అంటూ విద్యార్థి తల్లిదండ్రులు, మరికొందరు వికాస్ భారతి పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.