
అభికుమార్‌రెడ్డి
హైదరాబాద్: ‘‘నాన్న.. నా కోసం చాలా చేశావ్... నువ్వు నాకు చాలా ఇచ్చావు. కానీ దానికి ఫలితం లేకుండాపోయింది. సారీ డాడీ. తాత, నానమ్మ, అమ్మ, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో డాడీ. తమ్ముడు ఏం అనుకుంటే అది చేయనివ్వు డాడీ’’అని 16 పేపర్ల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ ఇంటర్ విద్యార్థి. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీలో హరిశ్రీటవర్స్‌లో నివాసముంటున్న భీమి రెడ్డి నాగరామిరెడ్డి కుమారుడు అభికుమార్‌రెడ్డి (17) మాతృశ్రీనగర్‌లోని చైతన్య కళాశాలలో ఐపీఎల్(1) ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
శనివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో కళాశాల రెండవ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో కళాశాల యాజమాన్యం దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. నాగరామిరెడ్డికి సమాచారం అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అభికుమార్‌రెడ్డి మృతిచెందాడు. అంతకుముందు తండ్రికి సూసైడ్ లెటర్ రాశాడు. యాజమాన్యం వేధింపుల కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు నాగరామిరెడ్డి ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment