50 ఏళ్ల మిస్టరీకి చెక్‌..కొత్త బ్లడ్‌ గ్రూప్‌ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు..! | Scientists Discover New Blood Group | Sakshi
Sakshi News home page

50 ఏళ్ల మిస్టరీకి చెక్‌..కొత్త బ్లడ్‌ గ్రూప్‌ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు..!

Published Wed, Sep 18 2024 5:24 PM | Last Updated on Wed, Sep 18 2024 5:59 PM

Scientists Discover New Blood Group

బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎన్‌హెచ్‌ఎస్‌ బ్లడ్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ (ఎన్‌హెచ్‌ఎస్‌బీటీ(NHSBT)) శాస్త్రవేత్తల బృందం కొత్త బ్లడ్‌ గ్రూప్‌ని కనుగొన్నారు. దీంతో దాదాపు 50 ఏళ్లుగా నిపుణులను కలవరపరుస్తున్న వైద్య రహస్యానికి తెరపడింది. ఈ సరికొత్త ఆవిష్కరణ రక్తమార్పిడి పద్ధతులను మార్చడమే కాకుండా రోగులకు కొత్త ఆశను అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు. 

పరిశోధకులు కనుగొన్న కొత్తబ్లడ్‌ రూప్‌ మాల్‌(MAL). ఇది ఏన్‌డబ్ల్యూజే యాంటిజెన్‌ నెగిటివ్‌ అనే బ్లడ్‌ గ్రూప్‌కి సంబంధించిన జన్యుపర మూలం. దీన్ని 1972లో మానవులు రక్తంలో గుర్తించారు. దీని వల్ల రక్త మార్పిడిలో ప్రతి చర్యలు లేదా సమ్యలు వస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందనేది నాటి శాస్త్రవేత్తలు వివరించలేకపోయారు. నిజానికి ఏనడబ్ల్యూజే యాంటిజన్‌ అనేది అధిక సంఘటన యాటిజన్‌లని అర్థం. దాదాపుగా మానవులందరి ఎర్రరక్త కణాలపై ఈ యాంటిజెన్‌లు ఉంటాయి. అయితే కొందరిలో ఇవి ఉండవు. దీన్ని గుర్తించడం కష్టం కూడా. అందువల్ల రక్తమార్పిడిలో కొందరు రోగులకు సమస్యలు ఎదురయ్యేవి. ఇది వైద్య శాస్త్రంలో చేధించలేని మిస్తరీగా ఉండేది. అది ఈ కొత్త బ్లడ్‌ గ్రూప్‌ ఆవిష్కరణతో 50 ఏళ్ల మిస్టరీని చేధించగలిగారు

ఈ మేరకు దాదాపు 20 ఏళ్లుగా ఈ ఎన్‌హెచ్‌ఎస్‌ బ్లండ్‌ అండ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ పరిశోధనకే అంకితమైన పరిశోధకుడు లూయిస్‌ టిల్లీ మాట్లాడుతూ.. తాము ఈ ఏన్‌డబ్ల్యూజే యాంటిజెన్‌ బ్లడ్‌ గ్రూప్‌ లేని వ్యక్తులను గుర్తించేందుకు ఈ పరిశోధన చేపట్టినట్లు తెలిపారు. తాము కనిపెట్టిన ఈ కొత్త రక్త నమునా అరుదైన రక్తరకాలు ఉన్న రోగులకు సంరక్షణ ఇస్తుందని చెబుతున్నారు. 

రక్తమార్పిడి సమయంలో ఎదురయ్యే ప్రతిచర్యలకు లేదా సమస్యలను నివారించడానికి ఈ పరిశోధన అత్యంత కీలకం. ప్రతిఏడాది దాదాపు 400 మంది రోగులు రక్తమార్పిడితో సమస్యలు ఎదుర్కుంటున్నారని చెప్పారు. వారికి రక్తం సరిపోలక పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నట్లు వెల్లడించారు. ఆ సమస్యలన్నింటికి ఈ కొత్త రక్తనమునా చెక్‌ పెట్టిందన్నారు. 

ఈ కొత్త బ్లడ్‌గ్రూప్‌ ఏన్‌డబ్ల్యూజే యాంటిజెన్‌ నెగిటివ్‌ ఉన్న దాతలు, గ్రహితలు ఇద్దరిని గర్తించడానికి జన్యు రూప పరీక్షలకి అనుమతిస్తుంది కాబట్టి అరుదైన కేసుల్లో రోగులకు ఎదురయ్యే రక్తమార్పిడి సమస్యలను ఇది నివారించగలుగలదని ధీమాగా చెబుతున్నారు. అలాగే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగుల సంరక్షణను మెరుగుపరుచడమే కాకుండా రక్తమార్పిడి భద్రత, ప్రభావాన్ని మెరుగుపరిచేందుకు గొప్ప అద్భత ఆవిష్కరణగా పేర్కొన్నారు నిపుణులు.

(చదవండి: ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకుని తినగా మిగిలింది డెలివరీ బాక్స్‌లోనే పెట్టి పడేస్తున్నారా?)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement