
వరంగల్: మహబూబాబాద్ మండలం సోమ్లతండా గ్రామానికి చెందిన భూక్య రమేష్ ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. చంద్రయాన్–3 ప్రయోగం సందర్భంగా ఇస్రోలోని ప్రధాన శాస్త్రవేత్తలతో కలిసి రమేష్ కూడా పాల్గొన్నారు.
వ్యవసాయ కుటుంబానికి చెందిన భూక్య భీముడు, లక్ష్మి దంపతుల మూడవ కుమారుడు అయిన రమేష్ ఇస్రోలో నాలుగేళ్లుగా కమ్యూనికేషన్ విభాగంలో పని చేస్తున్నారు. చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ప్రయోగం సమయంలో ఇక్కడే ఉండడం తనకు ఎంతో గర్వంగా ఉందని రమేష్ చెప్పారు. ఈసారి విజయవంతం కావడం భారత దేశ ప్రజల గొప్పతనమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment