మిల్లెట్స్ ఆరోగ్యానికి మంచివని తెలుసు. కానీ... రోజూ తినాలంటే కష్టంగా ఉంది. దోసె రుచి కోసం నాలుక మారాం చేస్తోంది. మరేం చేద్దాం... జొన్నతో దోసె చేద్దాం. జొన్నతోనే లంచ్ బాక్స్‌కి కిచిడీ చేద్దాం. ఎంచక్కా తింటూనే బరువు తగ్గుదాం.
కావలసినవి: జొన్న పిండి – కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; రవ్వ – పావు కప్పు; జీలకర్ర– అర టీ స్పూన్; పచ్చిమిర్చి– 2 (తరగాలి); అల్లం – అంగుళం ముక్క (తురమాలి); ఉప్పు – పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి; నూనె – టేబుల్ స్పూన్.
తయారీ: ∙ఒక వెడల్పు పాత్రలో జొన్నపిండి, బియ్యప్పిండి, రవ్వ, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసి కలపాలి. ఇందులో దాదాపుగా మూడు కప్పుల నీటిని ΄ోసి గరిటె జారుడుగా కలుపుకోవాలి. మిశ్రమం గట్టిగా అనిపిస్తే మరికొంత నీటిని చేర్చి కలిపి ఓ అరగంట సేపు నాననివ్వాలి ∙ఇప్పుడు పెనం వేడి చేసి ఒక గరిటె పిండితో దోసె వేసి, చుట్టూ పావు టీ స్పూన్ నూనె చిలకరించాలి. ఒకవైపు కాలిన తర్వాత తిరగేసి రెండో వైపు కూడా కాల్చితే జొన్న దోసె రెడీ. ఈ దోసెలోకి వేరుశనగపప్పు చట్నీ, సాంబారు, టొమాటో పచ్చడి మంచి కాంబినేషన్.
జొన్న కిచిడీ
కావలసినవి: జొన్నలు›– అరకప్పు; పెసరపప్పు – పావు కప్పు; కూరగాయల ముక్కలు – కప్పు (క్యారట్, బీన్స్, బఠాణీలు కలిపి); జీలకర్ర – అర టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; ఉప్పు – పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి; నీరు – 3 కప్పులు; నెయ్యి లేదా నూనె – టేబుల్ స్పూన్.
తయారీ: ∙జొన్నలను కడిగి మంచి నీటిలో నాలుగు గంటల సేపు నానబెట్టాలి ∙ప్రెషర్ కుక్కర్‌లో నెయ్యి వేడి చేసి జీలకర్ర వేసి మంట తగ్గించాలి. అవి వేగిన తర్వాత అందులో కూరగాయ ముక్కలు వేసి రెండు నిమిషాల సేపు మగ్గనివ్వాలి.
నానిన జొన్నలను కడిగి నీటిని వంపేసి పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పును కడిగి పెట్టుకోవాలి ∙కూరగాయ ముక్కల పచ్చిదనం ΄ోయిన తర్వాత అందులో జొన్నలు, పెసర పప్పు, పసుపు, ఉప్పు వేసి నీటిని ΄ోసి కలిపి మూత పెట్టాలి ∙మీడియం మంట మీద ఉడికించాలి. నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయాలి ∙ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసి గరిటెతో కలిపి వేడిగా వడ్డించాలి. ఇందులోకి ఆవకాయ, పెరుగు పచ్చడి బాగుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment