ఇన్‌స్టంట్ బర్ఫీ, బీట్‌రూట్ లౌకి ముఠియా
Bottle Gourd Recipes In Telugu: అధిక బరువుని తగ్గించుకోవడానికి ఎంచుకునే ఆహారాల్లో సొరకాయ ఒకటి. రుచిలో కాస్త చప్పగా ఉండే సొరకాయను తినడానికి అందరూ అంతగా ఇష్టపడకపోవచ్చు. అయితే, తయారీలో చిన్న మార్పులు చేసుకుంటే, సొరకాయను టేస్టీగా ఎలా వండవచ్చో చూద్దాం...
ఇన్‌స్టంట్ బర్ఫీ
కావలసినవి:
►పంచదార – ఒకటింబావు కప్పులు
►సొరకాయ తురుము – ఐదు కప్పులు
►నెయ్యి – అరకప్పు
►పాలపొడి – కప్పు
►యాలుకుల పొడి – అర టీస్పూను
►పిస్తాపలుకులు – అరకప్పు.
తయారీ: –
►కుకర్ గిన్నెలో పంచదారను పొరలా వేయాలి.
►దీనిపైన సొరకాయ తురుముని పరచాలి. ఈ రెండింటిని కలపకూడదు
►కుకర్ గిన్నె మూతపెట్టి ఐదు నిమిషాలు పెద్దమంటమీద ఉడికించాలి
►ఐదు నిమిషాల తరువాత మంటను ఆపేసి కుకర్ ప్రెజర్‌ను విడుదల చేసి మూత తీయాలి.
►ఇప్పుడు నెయ్యి, పాలపొడి, యాలకుల పొడి వేసి కలపాలి
►కుకర్ గిన్నెను సన్నని మంటమీద పెట్టి మరో పదినిమిషాలపాటు కలుపుతూ ఉడికించాలి
►నెయ్యి పైకి తేలేంతవరకు సిమ్‌లో ఉంచి అడుగంటకుండా కలుపుతూ ఉడికిన తర్వాత దించేయాలి
►ఒక ప్లేటుకి కొద్దిగా నెయ్యిరాసి ఉడికిన మిశ్రమాన్ని పోయాలి.
►దీనిమీద పిస్తాపలుకులు వేసి చల్లారనివ్వాలి.
►చల్లారాక ముక్కలు కోసి సర్వ్ చేసుకోవాలి.
బీట్‌రూట్ లౌకి ముఠియా
కావలసినవి:
►సొరకాయ తురుము – ఒకటిన్నర కప్పులు
►బీట్‌రూట్ తురుము – అరకప్పు
►ఉల్లిపాయ తరుగు – పావు కప్పు
►గోధుమ పిండి – అరకప్పు
►శనగపిండి – అరకప్పు
►సూజీ రవ్వ – కప్పు
►పసుపు – అరటీస్పూను
►ఇంగువ – పావు టీస్పూను,
►వంటసోడా – పావు టీస్పూను
►జీలకర్ర – అరటీస్పూను
►సోంపు – అరటీస్పూను
►పంచదార – టీస్పూను
►అల్లంపేస్టు – టీస్పూను
►పచ్చిమిర్చి – నాలుగు(సన్నగా తరగాలి)
►కొత్తిమీర తరుగు – మూడు టేబుల్ స్పూన్లు
►నిమ్మ రసం – టీస్పూను
►ఉప్పు – రుచికి సరిపడా
►నూనె టీస్పూను
తాలింపు కోసం: నూనె – మూడు టీస్పూన్లు, ఆవాలు – అరటీస్పూను, నువ్వులు – రెండు టీస్పూన్లు.
తయారీ:
►ఉల్లిపాయ, బీట్‌రూట్, సొరకాయ తురుములను గిన్నెలో వేయాలి.
►ఇందులో శనగపిండి, పసుపు, ఇంగువ, ఉప్మారవ్వ, జీలకర్ర, సోంపు, పంచదార, అల్లంపేస్టు, పచ్చిమిర్చి తరుగు, వంటసోడా, కొత్తిమీర, నిమ్మరసం, టీస్పూను నూనె, ►రుచికి సరిపడా ఉప్పు వేసి ముద్దలా కలపాలి
►ఈ పిండిని ట్రేలో దిబ్బరొట్టిలా పరుచుకుని ఆవిరి మీద ఇరవై నిమిషాలు ఉడికించాలి
►ఉడికిన తరువాత ఐదు అంగుళాల ముక్కలుగా కట్ చేయాలి
►తాలింపు కోసం తీసుకున్న దినుసులతో తాలింపు వేసి ముక్కల మీద చల్లుకుని వేడివేడిగా సర్వ్‌చేసుకోవాలి
►ముఠియాలు మరింత క్రిస్పీగా కావాలనుకుంటే ఆవిరి మీద ఉడికిన తరువాత డీప్ ఫ్రై చేసుకుని కూడా తినవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment