మటన్ కీమాతో కకోరి కబాబ్ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి.
కకోరి కబాబ్ తయారీకి కావలసినవి:
►మటన్ ఖీమా – రెండు కప్పులు
►వెల్లుల్లి పేస్టు – అరటీస్పూను
►అల్లం పేస్టు – అరటీస్పూను
►లవంగాలు – నాలుగు
►నల్లయాలుక్కాయ – ఒకటి
►దాల్చిన చెక్క పొడి – ఒకటిన్నర టీస్పూన్లు
►జాజికాయ పొడి – పావు టీస్పూను
►నెయ్యి – పావు కప్పు
►గుడ్డు – ఒకటి
►కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు
►పచ్చిమిర్చి తరుగు – మూడు టేబుల్ స్పూన్లు
►పచ్చిబొప్పాయి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు
►జీలకర్ర – టీస్పూను
►జాపత్రి పొడి – టీస్పూను
►ఉల్లిపాయ తరుగు – రెండు కప్పులు
►కాబూలి చనా పొడి – పావు కప్పు
►మిరియాల పొడి – పావు టీస్పూను
►ఉప్పు – రుచికి సరిపడా.
తయారీ విధానం:
►ముందుగా నెయ్యిలో ఉల్లిపాయ తరుగును గోల్డెన్ బ్రౌన్‌కలర్‌లోకి మారేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి
►ఒక గిన్నెలో మటన్ ఖీమా, మిగతా పదార్థాలన్నీ వేసి చక్కగా కలుపుకుని గంటపాటు రిఫ్రిజిరేటర్‌లో పెట్టాలి
►గంట తరువాత నానబెట్టిన మిశ్రమాన్ని కబాబ్‌లా వత్తుకుని గ్రిల్ మీద బ్రౌన్ కలర్‌లోకి మారేంత వరకు రెండు వైపులా కాల్చుకోవాలి
►చక్కగా కాలాక కొద్దిగా నెయ్యి రాసి మరో రెండు నిమిషాలు కాల్చి తీసేయాలి
►ఈ కబాబ్‌లపైన వేయించిన ఉల్లిపాయ తరుగు చల్లుకుని సర్వ్ చేసుకోవాలి.
ఇవి కూడా ట్రై చేయండి: Chicken Strips Recipe: మైదా, బ్రెడ్ ముక్కల పొడి.. చికెన్ స్ట్రిప్స్ తయారీ ఇలా!
Sweet Potato Cutlet Recipe: చిలగడ దుంపతో తియ్యటి కట్‌లెట్..
Comments
Please login to add a commentAdd a comment