ఘుమఘుమలాడే సూకా మటన్‌ ఇలా చేసుకోండి | Sukha Mutton Recipe Ingredients And Full Details | Sakshi
Sakshi News home page

Sukha Mutton Recipe: ఘుమఘుమలాడే సూకా మటన్‌ ఇలా చేసుకోండి

Published Sat, Jun 17 2023 5:04 PM | Last Updated on Fri, Jul 14 2023 4:37 PM

Sukha Mutton Recipe Ingredients And Full Details - Sakshi

సూకా మటన్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు

మటన్‌ ముక్కలు – అరకేజీ
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒకటిన్నర టీస్పూన్లు
ఉల్లిపాయ తరుగు – అరకప్పు
 వెల్లుల్లి రెబ్బలు – పదిహేను
 టొమాటో తరుగు – అరకప్పు
 పసుపు – పావు టీస్పూను
 కారం – రెండు టీస్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా

సూకా మసాలాకు కావాల్సినవి
ధనియాలు – టీస్పూను
 సోంపు – టీస్పూను
జీలకర్ర – అరటీస్పూను
 ఎండు మిర్చి – రెండు
 మిరియాలు – అరటీస్పూను (వీటన్నింటిని వేయించి ΄÷డిచేసుకోవాలి)
 తాలింపు కోసం: నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు
 దాల్చిన చెక్క – అరంగుళం ముక్క
లవంగాలు – రెండు యాలకులు – రెండు
 బిర్యానీ ఆకు – ఒకటి; కరివేపాకు – రెండు రెమ్మలు

తయారీ విధానం ఇలా..

  • మటన్‌ ముక్కలను శుభ్రంగా కడిగి ప్రెజర్‌ కుకర్‌ గిన్నెలో వేయాలి. దీనిలో.. పసుపు, పావు టీస్పూను కారం, కొద్దిగా ఉప్పు వేసి కల΄ాలి. కొద్దిగా నీళ్లు΄ోసి, మీడియం మంట మీద ఆరు విజిల్స్‌ రానిచ్చి పక్కన పెట్టుకోవాలి.
  • బాణలిలో నూనె వేసి కాగాక, కరివేపాకు తప్పించి తాలింపు దినుసులు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. ఇవన్నీ వేగాక ఉల్లితరుగు, తురిమిన వెలుల్లిని వేసుకోవాలి.
  • ఉల్లి మిశ్రమం బ్రౌన్‌ కలర్‌లోకి మారాక టొమాటో తరుగు వేయాలి.
  • టొమాటో పచ్చివాసన పోయాక ఉడికించిన మటన్, కారం, మసాలా పొడి వేయాలి.
  • పది నిమిషాలు వేగాక కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి తిప్పాలి. నూనె పైకి తేలేంత వరకు వేయిస్తే సూకా మటన్‌ రెడీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement