'మటన్ తింటే మంచిది'
బెంగళూరు: మటన్ తినండి.. రోగ నిరోధక శక్తి పెంచుకోండి' అంటున్నారు కర్ణాటక పశుసంవర్ధక శాఖ మంత్రి ఎ. మంజు. మేక మాంసం తింటే ఇమ్యునిటీ పెరుగుతుందని ఆయన భరోసాయిస్తున్నారు. అయితే ఇది శాస్త్రీయంగా నిర్ధారించి చెబుతున్న విషయం కాదని, తన వ్యక్తిగత అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ లో కేంద్రం నిర్వహిస్తున్న మేకల పెంపకం కేంద్రాన్ని పరిశీలించిన తర్వాత ఆయనీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
మేక మాంసంలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయన్నారు. 'మేకలు అన్నిరకాల పచ్చగడ్డిని తింటాయి. మటన్ లో యాంటిబాడీలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని తినేవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంద'ని మంజు పేర్కొన్నారు. యూపీఏ ఏర్పాటు చేసినట్టుగానే తమ రాష్ట్రంలోనూ మేకల పెంపకం కేంద్రాలు నెలకొల్పనున్నట్టు చెప్పారు.