Best Mutton Recipes: How To Prepare Mutton Chha Gosht Recipe In Telugu - Sakshi
Sakshi News home page

Mutton Chha Gosht Recipe: అరకేజీ మటన్‌తో ఇలా ఘుమఘుమలాడే వంటకం తయారు చేసుకోండి!

Published Mon, Jun 13 2022 3:31 PM | Last Updated on Mon, Jun 13 2022 4:17 PM

Recipes In Telugu: How To Make Mutton Chha Gosht - Sakshi

మటన్‌తో ఘుమఘులాడే ఛ ఘోష్ట్‌ ఇలా తయారు చేసుకోండి!

ఛ ఘోష్ట్‌ తయారీకి కావలసినవి:
►మటన్‌ ముక్కలు – అరకేజీ
►శనగపిండి – మూడు టేబుల్‌ స్పూన్లు
►లవంగాలు – నాలుగు
►అల్లం పేస్టు– టీస్పూను
►వెల్లులి పేస్టు – టీస్పూను
►ఆవనూనె – మూడు టేబుల్‌ స్పూన్లు
►ధనియాల పొడి – టీస్పూను
►పచ్చిమిర్చి – మూడు
►ఉప్పు – రుచికి సరిపడా
►పెరుగు – మూడు కప్పులు
►కారం – టీస్పూను
►నల్లయాలుక్కాయలు – మూడు
►ఇంగువ – అరటీస్పూను
►దాల్చిన చెక్క – అంగుళం ముక్క
►బిర్యానీ ఆకులు – రెండు
►ఉల్లిపాయలు – రెండు
►అల్లం – రెండు అంగుళాల ముక్క
►కొత్తిమీర తరుగు – గార్నిష్‌కు సరిపడా.

తయారీ..
►మటన్‌ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.
►అల్లం, వెల్లుల్లి పేస్టులు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలుక్కాయాలు, బిర్యానీ ఆకులను దంచుకుని వేయాలి.
►దీనిలోనే పెరుగు వేసి చక్కగా కలుపుకుని ఐదుగంటలపాటు రిఫ్రిజిరేటర్‌లో పెట్టుకోవాలి.
►స్టవ్‌ మీద బాణలిపెట్టి ఆవనూనె వేయాలి. నూనె వేడెక్కిన తరువాత, ధనియాల పొడి, ఇంగువ, కారం పచ్చిమిర్చి వేయాలి.
►అల్లాన్ని తురుముకుని వేయాలి.
►ఐదు నిమిషాలు వేగాక ఉల్లిపాయను ముక్కలు తరగి వేయాలి
►ఉల్లిపాయ వేడిక్కిన తరువాత శనగపిండి వేసి తిప్పాలి.
►నిమిషం పాటు వేగాక, నానబెట్టుకున్న మటన్‌ మిశ్రమాన్ని వేసి మగ్గనివ్వాలి
►అరగంటతరువాత పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి మరో ఇరవై నిమిషాలపాటు ఉడికించి నూనె పైకి తేలిన తరువాత దించేయాలి.

ఇవి కూడా ట్రై చేయండి: Prawns Salad Sandwich In Telugu: ప్రాన్స్‌ సలాడ్‌ శాండ్‌విచ్‌ ఇలా తయారు చేసుకోండి!
Kullu Trout Fish: ఘుమఘుమలాడే కులు ట్రౌట్‌ ఫిష్‌ తయారీ ఇలా!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement