సాక్షి, సిటిబ్యూరో : సిటీలో చికెన్, మటన్ ధరలు మండిపోతున్నాయి. హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో ధరలు అమాంతం పెంచేశారు. హోల్‌సేల్ కోడి ధర రూ.10 నుంచి 20 వరకు పెరిగాయి. కిలో మటన్ ధర రూ.50 పెరిగింది. దీంతో రిటైల్ వ్యాపారులకు కూడా ధరలు విపరీతంగా పెంచారు. ఈ లెక్కన కిలో చికెన్ 210 రూపాయలు కాగా..మటన్ రూ.550 కిలో విక్రయిస్తున్నారు. సాధారణ రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా 4 లక్షల నుంచి 5 లక్షల కిలోల వరకు చికెన్ విక్రయాలు జరుగుతాయి. అదివారం 70 లక్షల కిలోలు అమ్ముతారు. దసరా పండుగ రోజు దాదాపు 3 కోట్ల కిలోల వరకు విక్రయాలు జరగవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. అయితే ఈ ఏడాది డిమాండ్‌కు సరిపడా కోళ్ల ఉత్పత్తి లేదని తెలుస్తోంది. అందువల్లే రేట్లు పెంచుతున్నారని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాది దసరా పండుగకు డిమాండ్ కంటే ఎక్కువగా కోళ్ల సరఫరా ఉండడంతో, కిలో కోడి ధర రూ.100 దాటలేదని వారు పేర్కొన్నారు.
మటన్ కిలో రూ.550
ప్రస్తుతం మార్కెట్‌లో కిలో మటన్ ధర రూ.550 ఉండగా ఇక దసరా రోజు మటన్ ధరలు ఏ స్థాయిలో పెరుగుతుందోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ పొట్టేలుతో పాటు ఇతర పొట్టేళ్ల ధరలు హోల్‌సెల్ మార్కెట్‌లో బాగా పెరిగాయని, దీంతో రిటైల్ ధరలు పెంచాల్సి వస్తుందని మటన్ వ్యాపారులు చెబుతున్నారు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి మేకపొతులు, గొర్రెపొతులు ఎక్కువగా వచ్చేవి. వీటి ధరలు తెలంగాణ పొట్టెలు కంటే తక్కువగా ఉండడంతో కిలో మటన్ ధర రూ 500 లోపు ఉండేవి. ప్రస్తుతం తెలంగాణ పొట్టేలు మార్కెట్‌కు డిమండ్‌కు అనుగుణంగా దిగుమతి లేకపోవడంతో మటన్ ధరలు విపరింగా పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
రేట్ల పెరుగుదల ఇలా...
గత వారం కిలో కోడి ధర రూ.85... మంగళవారం ధర రూ.110
చికెన్ ధర గత వారం కిలో రూ. 160... మంగళవారం చికెన్ విత్ స్కిన్ రూ.210
స్కిన్‌లెస్ కిలో కోడి ధర రూ. 240... బోన్‌లెస్ చికెన్ ధర కిలో రూ.300
మటన్ కిలో గత వారం రూ.500 మంగళవారం ధర...కిలో రూ. 550
Comments
Please login to add a commentAdd a comment