రెన్ మార్గిట్ కళాఖండానికి రికార్డు ధర
బెల్జియం సర్రియలిస్ట్ ఆర్టిస్టు రెన్ మార్గిట్ చేతినుంచి జాలువారిన ఈ ప్రఖ్యాత పెయింటింగ్ వేలం రికార్డులను బద్దలు కొట్టింది. న్యూయార్క్‌లో క్రిస్టీస్ నిర్వహించిన తాజా వేలంలో ఏకంగా రూ.1,021 కోట్లు (12.1 కోట్ల డాలర్లు) పలికి సంచలనం సృష్టించింది. అధివాస్తవికతను చిత్రించే పెయింటింగుల్లో అత్యధిక ధర పలికిన రికార్డును సొంతం చేసుకుంది.
దీనికి 9.5 కోట్ల డాలర్ల దాకా పలకవచ్చని నిర్వహకులు అంచనా వేస్తే వాటిని కూడా అధిగమించేసింది! 1954కు చెందిన ఈ పెయింటింగ్ అధివాస్తవికతకు సంబంధించి అత్యుత్తమ వ్యక్తీకరణగా విమర్శకుల ప్రశంసలు పొందింది. మార్గిట్ వేసిన 27 ప్రఖ్యాత పెయింటింగ్‌ల కలెక్షన్ ‘ద ఎంపైర్ ఆఫ్ లైట్’లో దీన్ని మణిపూసగా చెబుతారు.
వీధి దీపపు వెలుగుల్లో ఇల్లు, దీపంతో సహా నీటిలో దాని ప్రతిబింబం, ముందూ వెనకా చెట్లు, పైన నీలాకాశం, తెల్లని మబ్బులతో చూసేందుకు సాదాసీదాగా కన్పించే ఈ పెయింటింగ్ వాస్తవానికి అత్యున్నత స్థాయి మారి్మకతకు అద్దం పడుతుందని కళాప్రియులు చెబుతారు. మార్గిట్ వేసిన మరో రెండు పెయింటింగులు కూడా కోటి, 37 లక్షల డాలర్ల చొప్పున అమ్ముడయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment