
తెనాలి: పట్టణానికి చెందిన ప్రముఖ హరికథా భాగవతారిణి, టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు హరికథకురాలు టి.రాధాబృందావని (58) మంగళవారం ఇక్కడి ఆర్‌ఆర్ నగర్లోని స్వగృహంలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రముఖ భాగవతార్ తిరువాయిపాటి రామారావు కుమార్తె రాధాబృందావని.
ప్రముఖ మృదంగ విద్వాంసుడు తిరుపతి రామానుజ సూరి కుమారుడు తిరు వెంగళయ్య సూరి భార్య. తొలుత ప్రఖ్యాత హరికథా భాగవతార్ తెల్లాకుల వెంకటేశ్వర గుప్త వద్ద శిష్యరికం చేసినా, తర్వాత తండ్రి గురువుగా హరికథ సాధన చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాల్లో హరికథాగానం చేశారు. కుసుమ హరనాథ్ హరికథను గానం చేస్తున్న ఏకైక కళాకారిణిగానూ గుర్తింపు పొందారు.