
భోపాల్: ఇన్‌స్టా రీల్‌కు ద్వేషపూరిత కామెంట్లు రావడంతో ఓ ట్రాన్స్‌జెండర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయినిలో జరిగింది. దీపావళి సందర్భంగా చీరకు సంబంధించిన ఓ వీడియోకు అసభ్యకరమైన కామెంట్లు వచ్చాయని, ఆ కారణంగానే ఆర్టిస్టు మరణించాడని మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ యాక్టర్ త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు అన్నారు.
ప్రన్షు(16) ఉజ్జెయినికి చెందిన ట్రాన్స్ జెండర్ సొంతంగా మేకప్ కళను నేర్చుకున్నాడు. మేకప్ ఆర్టిస్టుగా ఇన్‌స్టా అకౌంట్‌ను కూడా నడుపుతున్నాడు. మేకప్ కళ, బ్యూటీ కంటెంట్‌కు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తుండేవాడు. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా చీరకు సంబంధించిన ఓ వీడియోను పోస్టు చేశాడు. అయితే.. ఈ వీడియోకు 4,000 ద్వేషపూరితమైన కామెంట్లు వచ్చాయని మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ యాక్టర్ త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు తెలిపారు. ఈ కారణంగానే ప్రన్షు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించాడు. ట్రాన్స్‌జెండర్ వర్గానికి రక్షణ కల్పించడంలో ఇన్‌స్టా యాజమాన్యం విఫలమౌతోందని అన్నాడు.
ప్రన్షు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని స్థానిక పోలీసులు తెలిపారు. వీడియోకు వచ్చిన కామెంట్ల కారణంగానే ప్రన్షు మరణించాడు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు. దర్యాప్తు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
ఇదీ చదవండి: సీఎం అశోక్ గహ్లోత్ గొప్ప మనసు
Comments
Please login to add a commentAdd a comment