Walter De Maria's New York Earth Room Interesting Facts In Telugu - Sakshi
Sakshi News home page

The New York Earth Room: ‘చెత్త’ అపార్ట్‌మెంట్‌ రికార్డు.. భూ ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి మనిషి నేనే!!

Published Sun, Nov 21 2021 11:32 AM | Last Updated on Sun, Nov 21 2021 1:10 PM

Walter De Marias New York Earth Room Interesting Facts In Telugu - Sakshi

A room in New York City that contains 250 cubic yards of dirt worth a million dollars: ఆ అపార్ట్‌మెంట్‌ నిండా చెత్తే.. ఎక్కడ చూసిన దుమ్ము, ధూళే.. పైగా ఆ చెత్తను నాలుగు దశాబ్దాలుగా పరిరక్షిస్తున్నారు. పుట్టగొడుగులు, పురుగులు రాకుండా ప్రతిరోజూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదంతా వింటుంటే.. వెంటనే ఆ అపార్ట్‌మెంట్‌ ‘చెత్త’ కథ ఏంటో తెలుసుకోవాలని ఉంది కదూ! అసలు విషయం ఏంటంటే.. న్యూయార్క్‌కు చెందిన వాల్టర్‌ డి మారియా అనే వ్యక్తి 1977లో దుమ్ము, ధూళి ఉపయోగించి, ఓ అందమైన ఆర్ట్‌ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు.


వెంటనే 250 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ నిండా 140 టన్నుల దుమ్ము, ధూళి నింపాడు. తర్వాత వివిధ మార్పులు, చేర్పులు చేస్తూ.. చెత్తతో నింపిన అందమైన కళాకృతిని తయారు చేశాడు. దీనికి ‘న్యూయార్క్‌ ఎర్త్‌ రూమ్‌’గా పేరు పెట్టి, సందర్శకులను ఆహ్వానించాడు. మొదట్లో అందరూ అతన్ని పిచ్చివాడిగా భావించినా.. ఆ గదిని చూసి ఆశ్చర్యపోయారు. మానవ మనుగడ మొదలు కాకమునుపు ఉన్నటువంటి భూ ఉపరితలంగా ఆ గది కనిపిస్తుంది.


చెట్టు చేమ.. పుట్ట పురుగు ఉండవు. ఒకరకంగా చెప్పాలంటే అక్కడ అడుగుపెడితే.. భూ ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి మనిషి మనమే అన్న అనుభూతి కలిగిస్తుంది. అయితే, ఆ అదృష్టం మనకు లేదు. సందర్శకులు కేవలం ఆ గదిని చూడవచ్చు, ఆ మట్టి వాసనను ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం పెరిగిపోతున్న సందర్శకుల ర ద్దీని నియంత్రించడానికి రోజులో ముందుగా బుక్‌చేసుకున్న వందమందికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. 

చదవండి: ఒకే కంపెనీలో 75 ఏళ్ల సర్వీస్‌... 90 ఏళ్ల వయసులో రిటైర్‌మెంట్‌..!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement