dirt
-
‘చెత్త’ అపార్ట్మెంట్ రికార్డు.. భూ ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి మనిషి నేనే!!
A room in New York City that contains 250 cubic yards of dirt worth a million dollars: ఆ అపార్ట్మెంట్ నిండా చెత్తే.. ఎక్కడ చూసిన దుమ్ము, ధూళే.. పైగా ఆ చెత్తను నాలుగు దశాబ్దాలుగా పరిరక్షిస్తున్నారు. పుట్టగొడుగులు, పురుగులు రాకుండా ప్రతిరోజూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదంతా వింటుంటే.. వెంటనే ఆ అపార్ట్మెంట్ ‘చెత్త’ కథ ఏంటో తెలుసుకోవాలని ఉంది కదూ! అసలు విషయం ఏంటంటే.. న్యూయార్క్‌కు చెందిన వాల్టర్ డి మారియా అనే వ్యక్తి 1977లో దుమ్ము, ధూళి ఉపయోగించి, ఓ అందమైన ఆర్ట్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే 250 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఓ అపార్ట్మెంట్ నిండా 140 టన్నుల దుమ్ము, ధూళి నింపాడు. తర్వాత వివిధ మార్పులు, చేర్పులు చేస్తూ.. చెత్తతో నింపిన అందమైన కళాకృతిని తయారు చేశాడు. దీనికి ‘న్యూయార్క్ ఎర్త్ రూమ్’గా పేరు పెట్టి, సందర్శకులను ఆహ్వానించాడు. మొదట్లో అందరూ అతన్ని పిచ్చివాడిగా భావించినా.. ఆ గదిని చూసి ఆశ్చర్యపోయారు. మానవ మనుగడ మొదలు కాకమునుపు ఉన్నటువంటి భూ ఉపరితలంగా ఆ గది కనిపిస్తుంది. చెట్టు చేమ.. పుట్ట పురుగు ఉండవు. ఒకరకంగా చెప్పాలంటే అక్కడ అడుగుపెడితే.. భూ ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి మనిషి మనమే అన్న అనుభూతి కలిగిస్తుంది. అయితే, ఆ అదృష్టం మనకు లేదు. సందర్శకులు కేవలం ఆ గదిని చూడవచ్చు, ఆ మట్టి వాసనను ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం పెరిగిపోతున్న సందర్శకుల ర ద్దీని నియంత్రించడానికి రోజులో ముందుగా బుక్‌చేసుకున్న వందమందికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. చదవండి: ఒకే కంపెనీలో 75 ఏళ్ల సర్వీస్... 90 ఏళ్ల వయసులో రిటైర్మెంట్..!! -
ఎర్రకోటలో ‘దుమ్ము’ దులిపారు..
న్యూఢిల్లీ : భారత చరిత్రలో ఎర్రకోటకు ఉన్న విశిష్టత గురించి అందరికి తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశ ప్రధాని జాతీయ జెండా ఎగరేసేది ఇక్కడి నుంచే. అయితే పెరిగిపోతున్న కాలుష్యం వల్ల అటువంటి అద్భుత కట్టడాల ఉనికి ప్రశ్నార్ధకంగా మారుతుంది. దాదాపు నాలుగు శతాబ్దాల కిందట మెఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన ఎర్రకోటని పరిరక్షించటానికి భారత పురావస్తు సర్వే విభాగం(ఏఎస్ఐ) నడుం బిగించింది. అందులో భాగంగా ఎర్రకోట పరిధిలో దుమ్మును తొలగించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. కేవలం ఐదు నెలల కాలంలోనే కోటకు ముప్పుగా పరిణమించిన 22 లక్షల కేజీల దుమ్ము, ధూళిని ఏఎస్ఐ తొలగించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ పక్రియను మొదలుపెట్టిన పురావస్తు శాఖ... గత వందేళ్ల నుంచి దాదాపు రెండు మీటర్ల మందంగా విస్తరించిన మట్టి పొరను తొలగించామని ఏఎస్ఐ డైరక్టర్ జనరల్ జె శర్మ తెలిపారు. నేలపై పేరుకుపోయిన దుమ్ము కట్టడానికి ప్రమాదకరంగా మారిందన్నారు. ఎర్రకోటకు వాస్తవ రూపాన్ని తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. కోట లోపల మరుగుదొడ్లు, తాగునీరు వంటి వసతులు కల్పించడానికి ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. -
సిటీ నెం.1
♦ ‘దుమ్ము’ దులిపిన నివేదిక ♦ ధూళిలో గ్రేటర్‌దే అగ్రస్థానం ♦ కాలుష్య నియంత్రణ మండలి ♦ అధ్యయనంలో వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: అభివృద్ధి మాట ఏమోగానీ... దుమ్ము, ధూళి కాలుష్యంలో గ్రేటర్ నగరం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోంది. నగర వాసుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. అనేకమంది ఊపిరితిత్తుల సామర్థ్యం దెబ్బతినడం... ఎడతెరిపి లేని దగ్గు... గుండె జబ్బులకు ధూళి కాలుష్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. మహా నగరంలో రోజుకు 11.9 టన్నుల ధూళి కాలుష్యం వెలువడుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తాజా అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్తంగా ఆరు మహా నగరాలు... హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా, లక్నో, పాట్నా, షోలాపూర్‌లలో కాలుష్యంపై సీపీసీబీ ఇటీవల అధ్యయనం చేసింది. దీనిలో గ్రేటర్ సిటీఅగ్రస్థానంలో ఉంది. ఘనపు మీటరు గాలిలో ధూళి కాలుష్యం 60 మైక్రోగ్రాములకు మించకూడదు. కానీనగరంలోని చాలా ప్రాంతాల్లో 100 మైక్రోగ్రాములకు మించుతోందని కాలుష్య నియంత్రణ మండలి గణాంకాలు చెబుతున్నాయి. కారణాలివే... ♦గ్రేటర్లో మొత్తం 43 లక్షల వాహనాలు ఉన్నాయి. ఇందులో పదిహేనేళ్లకు పైబడినవి సిటీ నెం.1 ఆరు లక్షలు. వీటిలో ఆటోలు, బస్సులు, కార్లు, జీపులు, ఇతర రవాణా వాహనాల పొగతో ధూళి కాలుష్యం(ఆర్‌ఎస్‌పీఎం) అనూహ్యంగా పెరుగుతోంది. ♦ మెట్రో పనుల నేపథ్యంలో కాంక్రీటు, సిమెంటు మిశ్రమం నుంచి వెలువడే ధూళికణాలు, పిల్లర్ల కోసం తవ్వినపుడు వెలువడే దుమ్ము రేణువులు గాలిలో కలుస్తున్నాయి. ♦నిర్మాణ రంగం శరవేగంగా విస్తరిస్తుండడం, తరచూ రహదారుల మరమ్మతులు, విద్యుత్, టెలిఫోన్, మంచినీరు, మురుగునీటి పైపులైన్ల కోసం తవ్వకాలతో కాలుష్యం పెరుగుతోంది. ♦జలమండలి, జీహెచ్ఎంసీ, విద్యుత్ విభాగాల మధ్య సమన్వయం కొరవడడంతో ఒకరు పనులు పూర్తి చేసిన తరవాత మరో శాఖ పనులు చేపట్టి రహదారులను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. దీంతో తరచూ ధూళి మేఘాలు కమ్ముకుంటున్నాయి. ♦పనులు ముగిసిన తరువాత కూడా రోడ్లపై ఇసుక, ఇతర వ్యర్థాలు వదిలేయడంతో ఆర్‌ఎస్‌పీఎం శాతం పెరుగుతోందని పీసీబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ♦వాహనాల వేగానికి రహదారులపై లేచే దుమ్ము, ధూళి, ట్రాఫిక్ జాంలో చిక్కుకున్న డీజిల్ వాహనాల నుంచి వెలువడే పొగతోనూ ధూళి కాలుష్యం పెరుగుతోందని పీసీబీ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లోనే కాలుష్యం అధికం ♦పంజగుట్ట, జేఎన్టీయూ, జీడిమెట్ల, జూపార్కు, ప్యారడైజ్, చార్మినార్, ఉప్పల్ ప్రాంతాల్లో అధికంగా ధూళి కాలుష్యం (ఆర్‌ఎస్‌పీఎం-రెస్పైరబుల్ సస్పెండెడ్ పార్టిక్యులార్ మ్యాటర్) ప్రమాణాలు నమోదయ్యాయి. ♦కొన్నిచోట్ల నెలకు సగటున క్యూబిక్ మీటర్‌కు 150 మైక్రోగ్రాముల ఆర్‌ఎస్‌పీఎం చేరుతోంది. ♦కొన్ని సందర్భాల్లో ఘనపు మీటరు గాలిలో 250- 300 మైక్రోగ్రాములకు ఆర్‌ఎస్‌పీఎం చేరుకుంటోంది. అనర్థాలివీ... ♦ధూళి కాలుష్యం భారీగా పెరుగుతుండడంతో నగరంలో శ్వాస కోస సంబంధ వ్యాధులు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ♦ఆస్తమా, బ్రాంకైటీస్, హై బీపీ, ఊపిరితిత్తుల వృద్ధి రేటు తగ్గిపోవడం వంటివ్యాధులతో జనం సతమతమవుతున్నారు. ♦నగరంలోని వివిధ ఆస్పత్రులకు వస్తున్న రోగుల్లో 90 శాతానికి పైగా ధూళి కాలుష్యం బారిన పడుతున్న వారేనని వైద్యులు చెబుతున్నారు. -
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి
సింగరేణి సీఎండీ వాహనాన్ని అడ్డుకునేందుకు గ్రామస్తుల యత్నం వెళ్లిపోయిన సీఎండీ... గంట పాటు రోడ్డుపై బైఠాయింపు టేకులపల్లి : కోయగూడెం ఓపెన్‌కాస్టు నుంచి బొగ్గు రవాణా చేస్తున్న లారీలు, టిప్పర్ల వలన వచ్చే దుమ్ము, ధూళితో తమ ప్రాణాలు పోతున్నాయని, చర్యలు తీసుకోవాలని కోరుతూ సింగరేణి సీఎండీ శ్రీధర్ వాహనాన్ని సోమవారం పెట్రాంచెలక స్టేజీ వద్ద గ్రామస్తులు అడ్డుకున్నారు. సీఎండీ కేఓసీని సందర్శించి తిరిగి వస్తుండగా గ్రామస్తులు అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే వేగంగా వాహనం వారిని దాటి వెళ్లిపోవడంతో వెనుక వస్తున్న డెరైక్టర్లు,మిగిలిన అధికారుల వాహనాలను అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు. వీరికి జెడ్పీటీసీ లక్కినేని సురేందర్‌రావు, ఎంపీపీ భూక్య లక్ష్మి, సొసైటీ అధ్యక్షులు వాంకుడోత్ పూన్యా, కోయగూడెం సర్పంచ్ పూనెం సురేందర్ మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సైలు బత్తుల సత్యనారాయణ, ముత్తా రవికుమార్‌ల ఆధ్వర్యంలో సిబ్బంది వారిని శాంతింపజేసేందుకు యత్నించారు. కానీ అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గంట పాటు ఆందోళన కొనసాగించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఆందోళన ఉధృతం అవుతుండటంతో పోలీసులు, కేఓసీ పీఓ అభ్యర్ధన మేరకు సింగరేణి డెరైక్టర్లు కారు దిగి వచ్చి వారితో మాట్లాడారు. వారం రోజుల్లో పెట్రాంచెలక స్టేజీ నుంచి టేకులపల్లి రోడ్డు పనులు ప్రారంభం అవుతాయని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో డి ప్రసాద్, గణితి కోటేశ్వరరావు, ఎండీ రాసుద్దీన్, నోముల భానుచందర్, జమీల్, శ్రీనివాస్, ప్రకాశ్, శంకర్, మారుతీరావు,రెడ్యానాయక్ పాల్గొన్నారు. -
శిరోజాలకు ఆవ...
అందం దుమ్ము, ధూళి, కాలుష్యం, పోషకాహార లోపం.. చిన్నాపెద్దల్ని బాధిస్తున్నాయి. ఈ ప్రభావం శిరోజాల మీద పడడంతో అతిగా వెంట్రుకలు రాలడం, నిర్జీవమవడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలకు ఉపశమనంగా కొన్ని జాగ్రత్తలు ఇంట్లోనే తీసుకోవచ్చు.. ఆవ నూనె ఆవనూనెలో కొన్ని ఉసిరిముక్కలు, మెంతి గింజలు కలిపి వేడిచేయాలి. రాత్రి పడుకోబోయే ముందు ఈ నూనెను వెచ్చబరిచి కుదుళ్లకు పట్టించాలి. రసాయన గాఢత తక్కువగా ఉన్న షాంపూతో మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఇలా 2-3 నెలలు చేస్తే జుట్టు రాలడం తగ్గడమే కాదు, ఒత్తుగా పెరుగుతుంది. 2-3 నెలలకు ఒకసారి చిట్లిన వెంట్రుకల చివరలను కత్తిరించాలి. దీని వల్ల వెంట్రుక పెళుసుబారి, తెగిపోకుండా బలంగా పెరుగుతుంది. హెయిర్ కలర్, సీరమ్, కండిషనర్స్, కర్లింగ్ మెషిన్ లేదా రీ బాండింగ్ ఉత్పత్తులు వెంట్రుకలను దెబ్బతీస్తాయి. పొడిబారేలా చేసి, వెంట్రుక పెరుగుదలను నిరోధిస్తాయి. అందుకని వీటిని వీలైనంత తక్కువగా ఉపయోగించాలి. కేశాలంకరణలో తప్పనిసరి అయితే, నిపుణుల సూచనలు పాటించాలి. ప్రతిరోజూ వెంట్రుక పెరుగుదల ఉంటుంది. తాజా పండ్లు, బాదంపప్పు, గుడ్డులోని తెల్లసొన, ఉసిరిక పొడి, నీరు వెంట్రుక బలానికి, నిగనిగలాడుతూ పెరగడానికి దోహదం చేస్తాయి. -గీతాంజలి ప్రియ, బ్యూటీషియన్ -
పట్టపగలే చిమ్మచీకట్లు
నగరవాసులకు వింత అనుభూతి సాక్షి, న్యూఢిల్లీ : నగరంలో శుక్రవారం వాతావరణం స్థానికులకు వింత అనుభూతి మిగిల్చింది. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపం చూపగా, సాయంత్రం గాలి దుమ్ము, ధూళితోపాటు ఉరుములతో కూడిన వానజల్లుపడింది. దీంతో ఒక్కసారి వాతావరణం చల్లబడింది. గాలిదుమ్ము ప్రభావం తో సాయంత్రం ఐదు గంటల సమయానికే చిమ్మచీకట్లు అలుముకున్నాయి. వాతావరణమంతా ధూళిమయం కావడంతో సాయంత్రం కార్యాలయం నుంచి ఇళ్లకు బయల్దేరినవారు అందులో చిక్కుకుపోయారు. గాలి బలంగా వీయడంతో కొన్నిచోట్ల చెట్లకొమ్మలు నేలకూలాయి. పాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 46, కనిష్ట ఉష్ణోగ్రత 33.7 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. రాజస్థాన్‌లో మూడు రోజులుగా వడగాడ్పులు వీస్తున్నాయని, దీని ప్రభా వం కారణంగా ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆదివారాలలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గొచ్చని, అయితే వచ్చే నెల రెండో తేదీ మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ విభాగం డైరక్టర్ ఎం.దొరైస్వామి చెప్పారు. ఇదిలాఉంచితే ఎండతీవ్రతతో పాటు విద్యుత్ కోత కూడా నగరవాసులను ఇబ్బందులకు గురిచేసింది. మెట్రో రైలుసేవలకు అంతరాయం దుమ్ముధూళితో కూడిన బలమైన గాలు లు వీయడంతో మెట్రో రైలుసేవలకు సైతం అంతరాయం కలిగింది. దాదాపు గంటపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, ఎక్కడి రైళ్లు అక్కడే నిలి చిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయాన్ని డీఎంఆర్సీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అంజుదయాళ్ వెల్లడించారు. బలమైన గాలుల ధాటికి పైపులు, ఇతర ఇనుప సామగ్రి జనక్‌పురి, ఇందర్‌లోక్ తదితర స్టేషన్లలోని ఓవర్‌హెడ్ తీగలపై పడడంకూడా మెట్రో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించింది. ఏదిఏమైనప్పటికీ సాయంత్రం ఆరు గంటల సమయంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ విషయమై కృతి మిస్త్రీ అనే ఓ ప్రయాణికుడు మాట్లాడుతూ జనక్‌పురి స్టేషన్లో దాదాపు గంటపాటు రైలు కోసం ఎదురు చూడాల్సి వచ్చిందన్నాడు. సేవలను పునరుద్ధరించినప్పటికీ తొలుత వచ్చిన రెండు రెళ్లలో ఎక్కలేకపోయానని, ఇందుకు కారణం అవి కిక్కిరిసిపోవడమేనని వివరించాడు.