ఓల్డ్ ఈజ్ గోల్డ్..
వీడో పాతకాలం నాటి మరమనిషి.. పేరు సైగాన్. ఇప్పుడంటే రోబోలు అన్ని పనులు చేసేస్తున్నాయి గానీ.. అప్పట్లో వీడు కొంచెం ముందుకు వెనక్కు నడిచి.. డ్రింక్ క్యాన్‌లను తీసి ఇస్తే చాలు.. అందరూ కెవ్వు కేక అనేసేవారు. ఎందుకంటే.. అప్పట్లో రోబోలు ఉండేవే తక్కువ కదా.. 8 అడుగుల ఎత్తుండే ఈ అల్యూమినియం రోబో సైగాన్‌ను ఇటలీకి చెందిన డిజైనర్ ఒకరు తయారుచేశారు.
తాజాగా దీన్ని బ్రిటన్‌లోని సౌత్ కెన్సింగ్‌టన్‌లో క్రిస్టీస్ సంస్థ వేలం వేస్తే ఓ వ్యక్తి రూ.18 లక్షలకు కొనుక్కున్నాడు. ఈ పాత రోబోకు రూ.8-9 లక్షలొస్తాయని భావించారట. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేసి.. ఈ ధరకు అమ్ముడుపోయింది. కొనుక్కున్న వ్యక్తి తన పేరును వెల్లడించడానికి నిరాకరించారు