నేను మనిషినేనండి బాబూ! | Robot 2.0: Amy Jackson to shoot with Akshay Kumar | Sakshi
Sakshi News home page

నేను మనిషినేనండి బాబూ!

Published Fri, Apr 15 2016 11:45 PM | Last Updated on Sun, Sep 3 2017 10:00 PM

నేను మనిషినేనండి బాబూ!

నేను మనిషినేనండి బాబూ!

అసలు నువ్వు మనిషివేనా? ఇంకేమైనానా? అని మనం కామన్‌గా అంటుంటాం... వింటుంటాం. ఏ మనిషి అయినా తాను మనిషినే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే చాలా ఇబ్బందే. ఇప్పుడు అందాల తార అమీ జాక్సన్‌కి అలాంటి పరిస్థితే వచ్చింది. విషయం ఏంటంటే.. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘2.0’ (రోబో-2)లో అమీ జాక్సన్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అమీ రోబోగా నటిస్తున్నారనే వార్త ప్రచారంలో ఉంది. దాంతో అమీ క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సింది.

‘నేను రోబోని కాదు.. మనిషినేనండి బాబూ’ అని పేర్కొన్నారు అమీ. మీ పాత్ర ఎలా ఉంటుంది? అని అడిగితే, ‘ఇప్పుడు చెప్పను’ అని ఊరిస్తున్నారు. ముద్దుగుమ్మ మూతిని సున్నాలా చుట్టి మరీ అలా ఊరిస్తే ఎవరికి మాత్రం ముచ్చటగా ఉండదు. అందుకే పాత్ర గురించి చెప్పకపోయినా చల్తా హై అని సరిపెట్టుకున్నారు. ఈ చిత్రంలో అమీ గ్లామరస్‌గా మాత్రమే కాదు. పవర్‌ఫుల్‌గా కూడా కనిపిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే ఈ మధ్య హీరో రజనీకాంత్, విలన్‌గా నటిస్తున్న హిందీ హీరో అక్షయ్‌కుమార్‌లతో తీసిన పోరాట సన్నివేశాల్లో అమీ కూడా పాల్గొన్నారట. ఈ చిత్రం షూటింగ్ భలే కిక్ ఇస్తోందని ఆమె అంటున్నారు. అమీ ఫైట్స్ చేస్తే చూసేవాళ్లకీ కిక్కే మరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement