చిట్టికి 14 ఏళ్లు పూర్తి.. మేకర్స్ స్పెషల్ వీడియో వైరల్! | Super Star Rajinikanth Movie Robo Completes 14 Years Today | Sakshi
Sakshi News home page

Rajinikanth Movie: చిట్టికి 14 ఏళ్లు.. స్పెషల్ వీడియో వైరల్!

Published Tue, Oct 1 2024 6:19 PM | Last Updated on Tue, Oct 1 2024 6:59 PM

Super Star Rajinikanth Movie Robo Completes 14 Years Today

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీ రోబో. శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సైంటిఫిక్‌ యాక్షన్‌ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తమిళంలో ఎంథిరన్‌ పేరుతో ఈ మూవీని శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. తెలుగులో రోబో పేరుతో విడుదలైన ఈ మూవీకి ‍విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. చిట్టి అనే పేరు గల రోబో ఆడియన్స్‌ను ఎమోషనల్‌గా టచ్‌ చేసింది. ఈ మూవీ సూపర్ హిట్‌ కావడంతో రోబో-2ను సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు శంకర్.

అయితే ఎంథిరన్‌(రోబో) విడుదలై సరిగ్గా నేటికి 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సన్‌ పిక్చర్స్‌ యాజమాన్యం స్పెషల్ వీడియోను షేర్ చేసింది. భారతీయ సినిమాని పునర్‌వైభవం తీసుకొచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం.. ఏ మాస్టర్ పీస్ ఎంతిరన్ 14 సంవత్సరాల వేడుక జరుపుకుంటోంది అంటూ స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement