
సాక్షి, చెన్నై: రజనీకాంత్ సన్నిహితుడు అర్జునమూర్తికి ఎన్నికల చిహ్నంగా రోబో దక్కింది. ఇది ఎంతో ఆనందంగా ఉందని అర్జునమూర్తి వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీ ఏర్పాటు కసరత్తుల్లో భాగంగా అర్జునమూర్తికి కనీ్వనర్ పదవిని రజనీకాంత్ ఇచ్చిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో రాజకీయ పార్టీ ప్రకటనను రజనీ విరమించుకున్నారు. దీంతో అర్జునమూర్తి సొంత పార్టీని ప్రకటించుకున్నారు. ఇందుకు రజనీ సైతం ఆశీస్సులు అందించే రీతిలో శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ పరిస్థితుల్లో అర్జునమూర్తి ఏర్పాటు చేసిన ఇండియా మక్కల్ మున్నేట్ర కళగంకు ఎన్నికల కమిషన్ ఎన్నికల చిహ్నంగా రోబోను కేటాయించింది. రజనీకాంత్ నటించిన చిత్రం ‘రోబో’ ఇప్పటికే ప్రచారంలో ఉన్న దృష్ట్యా, తన పార్టీ చిహ్నాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం సులభతరం అని అర్జునమూర్తి ధీమా వ్యక్తం చేశారు.