tamilnadu assembly election
-
Kamal Haasan: ఒంటరిగా పోటీ చేసుంటే బాగుండేది!
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమలహాసన్‌ను అంతర్మథనంలో పడేసింది. కనీసం మూడోస్థానం కూడా దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మంగళవారం చెన్నైలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలు, అందుబాటులో ఉన్న అభ్యర్థులతో సమావేశమయ్యారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీకి వచ్చిన ఓట్లు, ఓటమికి గల కారణాలపై చర్చించారు. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసుంటే బాగుండేదని పార్టీ నేతల వద్ద ప్రస్తావించారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రణాళిక పార్టీలో సమూల మార్పులు, క్షేత్రస్థాయి నుంచి బలోపేతానికి కృషి చేద్దామని చెప్పినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఇక, కొత్త నిర్ణయాలు, మార్పులతో ముందుకు సాగుదామని, త్వరలో అన్ని వివరాలు ప్రకటిస్తానని కమల్ నేతల వద్ద పేర్కొన్నారు. ఈ సమావేశంపై మక్కల్ నీదిమయ్యం ఉపాధ్యక్షుడు పొన్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి కారణాలపై విశ్లేషించుకున్నామని తెలిపారు. ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొని ఉంటే కనీసం మూడో స్థానం దక్కి ఉండేదన్న అభిప్రాయాన్ని సమావేశం ముందు పలువురు ఉంచినట్టు పేర్కొన్నారు. ప్రజలతో మమేకం అయ్యే రీతిలో కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. చదవండి: తండ్రి ఓటమిపై శృతిహాసన్ కామెంట్స్ వైరల్ -
ఓటు వేసిన హీరో విజయ్.. బిల్డప్ అంటూ ట్రోల్స్
సాక్షి, చెన్నై: వినూత్నమైన పనులు చేస్తూ నటుడు విజయ్ ఎప్పుడూ తన ప్రత్యేకతను చాటుకుంటాడు. మంగళవారం జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సైకిల్‌పై వచ్చి ఓటు వేశారు. పోలింగ్ కేంద్రంలో అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఆయన సైకిల్‌పై వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హీరో విజయ్ వేగంగా సైకిల్ తొక్కుతూ పోలింగ్ కేంద్రానికి వస్తుండగా రోడ్డుపై అభిమానులు అయన వెంట బైక్‌లతో అనుసరించారు. సాధారణ వ్యక్తిలా పోలింగ్ కేంద్రానికి విజయ్ సైకిల్ మీద వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే హీరో విజయ్ తన ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయడంపై కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా ఈ వీడియోను చూసిన నెటిజన్లు హీరో విజయ్ బిల్డప్ కోసమే సైకిల్‌పై వచ్చాడంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే విజయ్ సైకిల్ మీద రావడనికి కారణం ఇదే అంటూ ఆయన సోషల్ మీడియా టీం ఓ ప్రకటన విడుదల చేసింది. తలాపతి విజయ్ సైకిల్‌పై వచ్చి ఓటు వేయడానికి కారణం ఉంది. పోలింగ్ బూత్ తన ఇంటి వెనుక వీధిలో ఉంది. అది ఒక ఇరుకైన వీధి, కారును అక్కడికి తీసుకెళ్లడం కష్టం. అందుకే ఆయన సైకిల్‌పై పోలింగ్ కేంద్రానికి వెళ్లారని, దీనికి వేరే కారణం లేదని విజయ్ సోషల్ మీడియా టీం పేర్కొంది. #Vijay arrives in cycle to cast his vote #TamilNaduElections pic.twitter.com/iKY4bkIqA8 — BARaju (@baraju_SuperHit) April 6, 2021 -
100 రోజుల్లో చేసి చూపిస్తా: కమల్
సాక్షి, చెన్నై: పదేళ్లలో చేయలేని పనుల్ని వందరోజుల్లో చేసి చూపిస్తానని మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ ధీమా వ్యక్తం చేశారు. భారత దేశానికే కోయంబత్తూరును ఆదర్శనగరంగా మార్చేస్తానని హామీ ఇచ్చారు. కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గంలో పోటీచేస్తున్న కమల్ ఆదివారం నియోజకవర్గంలో ఆగమేఘాలపై ప్రచారం చేశారు. రోడ్‌షో ద్వారా ప్రధాన మార్గాలు, చిన్న చిన్న వీధుల్లో సైతం దూసుకెళ్లారు. సినీ తరహా డైలాగులతో, రాజకీయఅంశాలతో, ప్రజాకర్షణ లక్ష్యంగా, ప్రజాసంక్షేమాన్ని కాంక్షిస్తూ తాము ప్రకటించిన మేనిఫెస్టోను వివరిస్తూ ముందుకుసాగారు. పదేళ్లల్లో ఈ పాలకులు చేయలేని పనుల్ని వంద రోజుల్లో చేసి చూపిస్తానని ప్రకటించారు. ప్రజలు తనకు అండగా ఉంటే చాలు అని, మార్పు నినాదంతో రాష్ట్రం రూపురేఖల్ని మార్చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన సవాల్ విషయంగా కమల్ స్పందిస్తూ, తన ప్రత్యర్థి బీజేపీకి చెందిన వానతీ శ్రీనివాసన్ ఓ డమ్మీ అంటూ, ఈ విషయంగా ప్రధాని మోదీతో చర్చించేందుకు సైతం సిద్ధం అని పేర్కొన్నారు. కమల్‌కు మద్దతుగా ఆ నియోజకవర్గంలో సినీ నటి, ఆయన అన్న చారుహాసన్ కుమార్తె సుహాసిని సుడిగాలి ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఓటర్లతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ, కమల్‌ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: యాక్సిడెంటల్ హోం మినిస్టర్ -
డీఎంకే కూటమిలో కొలిక్కివచ్చిన సీట్ల కేటాయింపు
సాక్షి, చెన్నై : డీఎంకే కూటమిలో సీట్ల కేటాయింపు ఓ కొలిక్కి వచ్చింది. సీట్ల సర్దు బాటు విషయంలో కాంగ్రెస్, డీఎంకే మధ్య ఒప్పందం కుదిరింది. డీఎంకే 180 స్థానాల్లో.. కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కన్యాకుమారి లోక్‌సభ ఉపఎన్నికలలోనూ కాంగ్రెస్ పోటీ చేయనుంది. కాగా, గడిచిన అసెంబ్లీలో కేటాయించినట్లుగా ఈసారి కూడా 41 సీట్లకు కాంగ్రెస్ పట్టుబట్టడం, డీఎంకే కాదు పొమ్మని ఖరాఖండిగా చెప్పడంతో నిన్నటి వరకు ప్రతిష్టంభన కొనసాగింది. కోరినన్ని సీట్లు కేటాయించకపోగా చర్చల సమయంలో తమ పట్ల అవమానకరంగా ప్రవర్తించారని కాంగ్రెస్ అధ్యక్షులు కేఎస్ అళగిరి కన్నీళ్లు పెట్టుకోవడం ఆ పార్టీ నేతలను కలచివేసింది. ఒకనొక దశలో కనీసం 30 సీట్లు ఇవ్వకుంటే డీఎంకేతో తెగతెంపులు చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ పరిణామాలను రాహుల్‌గాంధీకి వివరించి ఆయన సలహామేరకు కూటమిలో కొనసాగడంపై నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. పార్టీ ఆశావహులతో ముఖాముఖి ముగిసిన తరువాత ఆదివారం మరోసారి డీఎంకేతో చర్చలకు కూర్చున్నారు. ఈ నేపథ్యంలో 25 సీట్లకు కాంగ్రెస్ అంగీకారం తెలిపింది. చదవండి : బీజేపీ బీ–టీం నేను కాదు.. ఆ పార్టీనే: కమల్ -
వంద కోట్లు ఇస్తామన్నా, తలొగ్గలేదు: కమల్ హాసన్
సాక్షి, చెన్నై: తన నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు ఖాయమని, అయితే, ఎస్ఎంకే, ఐజేకేలతో ఇంకా పొత్తు ఖరారు కాలేదని మక్కల్ నీది మయ్యం నేత కమల్ తెలిపారు. కేవలం చేతులు మాత్రం కలిపామని, పొత్తుకు చర్చలు జరగాల్సి ఉందన్నారు. తమ కూటమి సీఎం అభ్యర్థి కమల్ అని, కూటమి ఖరారైనట్టుగా ఎస్ఎంకే నేత శరత్‌కుమార్ బుధవారం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ పొత్తు ఇంకా ఖరారు కాలేదని కమల్ ప్రకటించడం చర్చకు దారి తీసింది. ఎన్నికల వాగ్దానాలుగా తరచూ కమల్ కొన్ని ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం మహిళలు, యువత, క్రీడాకారులను ప్రోత్సహించే రీతిలో ఏడు వాగ్దానాలు చేశారు. ఈసందర్భంగా మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఎస్ఎంకే, ఐజేకేలతో చేతులు కలిపామేగానీ, పొత్తు ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేశారు. పొత్తులు, పందేరాల విషయంగా చర్చలు సాగాల్సి ఉందన్నారు. మంచి వాళ్లు వస్తే తన కూటమిలోకి చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, రావాలనుకునే వాళ్లు త్వరగా తరలి రావాలని పిలుపునిచ్చారు. వెన్నంటి పొన్రాజ్ ఇటీవల కలాం లక్ష్య ఇండియాను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పొన్రాజ్ మక్కల్ నీది మయ్యం కట్చిలో చేరడంతో ఆయనకు ఏకంగా పార్టీ ఉపాధ్యక్ష పదవిని కమల్ అప్పగించడం విశేషం. ఎవరూ కొనలేరు.. మైలాపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కమల్ ప్రసంగిస్తూ అవినీతిపైనే తన యుద్ధమని, అవినీతి పాలకుల్ని తరిమికొట్టడం లక్ష్యంగా, మార్పును ఆశిస్తున్న ప్రజలకు సుపరిపాలన అందించాలన్న కాంక్షతో ముందుకు సాగుతున్నట్టు పేర్కొన్నారు. తనను కొనేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయని, వంద కోట్లు ఇస్తామన్నా, తలొగ్గలేదని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఓ డైలాగును తాను గతంలోనే దశవాతారం సినిమాలోనూ ముందే చెప్పినట్టు గుర్తు చేశారు. తనను ఎవరూ కొనలేరని, తనకు ఏడున్నర కోట్ల తమిళ ప్రజలు, ఈ ప్రజల నెత్తిన భారంగా ఉన్న రూ.5.70 లక్షల కోట్లు అప్పును తీర్చడం లక్ష్యం అని వ్యాఖ్యానించారు. అధికార, ధనబలంతో ఓట్లను కొనవచ్చన్న ధీమా తో తిరిగే వాళ్లు, కొత్తగా తమిళంపై ప్రేమ, మక్కువ ఉన్నట్టు నటించే వాళ్లు, తమిళం మాట్లాడ లేకున్నానే అని ఆవేదన వ్యక్తం చేసే వాళ్లు రాష్ట్రంలోకి వచ్చి వెళ్తున్నారని, వారిని నమ్మితే ఈ రాష్ట్రం అధోగతిపాలు కావడం తథ్యమని కమల్‌హాసన్ హెచ్చరించారు. -
వ్యూహాత్మక వెనకడుగు!
దశాబ్దాలుగా సినీ రంగ ప్రభావం అపారంగా వున్న తమిళనాడు రాజకీయాలు అచ్చం ఆ రంగాన్నే అనుకరిస్తూ జనంలో ఉత్కంఠను రేపుతున్నాయి. నిరుడు డిసెంబర్ 4న రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్టు ప్రకటించి, ఆ నెలాఖరుకల్లా యూటర్న్ తీసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ మాదిరే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత సహచరి శశికళ కూడా రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్టు బుధవారం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. శశికళ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటించి నిండా నెల్లాళ్లు కాలేదు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించి, ఆ తర్వాత కరోనా మహమ్మారిని కూడా ఎదుర్కొని గత నెల 8న ఆమె బెంగళూరు నుంచి చెన్నై వచ్చారు. ఆ సందర్భంలోనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనబోతున్నట్టు ప్రకటించారు. కేవలం 24 రోజుల వ్యవధిలో ఆమె మనసు మార్చుకోవటానికి కారణమేమిటి? శశికళ రాష్ట్రంలో అడుగుపెట్టాక ఆమెపై చాలా చర్చే జరిగింది. అన్నా డీఎంకేతో ఆమెకు సామరస్యత ఏర్పడటం మాట కల్లని కొందరు... మిత్రభేదం కనుక సర్దుబాటు కష్టం కాదని మరికొందరు జోస్యం చెప్పారు. కానీ ముఖ్యమంత్రి పళనిస్వామి మొదలుకొని అన్నా డీఎంకే నేతలందరికీ ఆమె కంట్లో నలుసు మాదిరే కనబడ్డారు. పార్టీని కబ్జా చేయాలన్న శశికళ ప్రయత్నాలు ఫలించబోవని పళనిస్వామి నేరుగానే అన్నారు. శశికళ సైతం వారిని అదే భాషలో దుయ్యబట్టారు. వారిని పిరికివాళ్లుగా అభివర్ణించారు. పళనిస్వామి అయినా, మరో మాజీ సీఎం పన్నీరుసెల్వమైనా గత నాలుగేళ్లుగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. కేంద్రంలోని బీజేపీ అధినేతల ఆశీర్వాద బలంతోనే కావొచ్చుగానీ... సొంతంగా నిర్ణయాలు తీసుకో గలుగుతున్నారు. జయలలిత హయాంలోనూ, ఆ తర్వాత శశికళ ఏలుబడిలో స్వల్పకాలం పార్టీ నేతలంతా ఎంత ఒదిగి వుండాల్సివచ్చిందో ఎవరికీ తెలియనిది కాదు. స్వతంత్రంగా వ్యవహరించటం తెలియనప్పుడు వేరే సంగతికానీ... అలవాటుపడ్డాక దాన్ని కోల్పోవటానికి సిద్ధపడేదెవరు? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాన్నాళ్ల సమయం వుందనుకున్నప్పుడే అక్కడి రాజకీయాలు వింత మలుపులు తిరిగాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీ సంగతిని ప్రకటించాక రాష్ట్ర రాజకీయాలెలా వుండబోతున్నాయో చాలామంది కష్టపడి కూడికలు, తీసివేతలూ వేశారు. అవి ఇంకా పూర్తికాకుండానే ఆయన నిష్క్రమణ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పుడూ అలాగే జరిగింది. శశికళ రాకతో ఎలాంటి మార్పులు చోటుచేసుకోవచ్చునో అంచనాలు వేసిన వారందరిదీ వృధా ప్రయాసగా మిగిలిపోయింది. శశికళ ఏం చెప్పినా...ఆమెలో కలిగిన ఈ హఠాత్ రాజకీయ వైరాగ్యానికి అసలు కారణమేమిటన్నదే ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ఆమెకు లభించిన మద్దతు చిన్నదేమీ కాదు. బెంగళూరు నుంచి చెన్నైకి కారులో వెళ్లటానికి గరిష్టంగా 5, 6 గంటల సమయం మించి పట్టదు. కానీ ఆమె ఆ దూరాన్ని 23 గంటలు ప్రయాణించారు. మధ్యలో దేవాల యాల సందర్శనలున్నాయి. కానీ ఎక్కడికక్కడ ఎదురుచూసిన మద్దతుదార్లవల్లనే ఈ జాప్యం చోటుచేసుకుందని శశికళ అనుచరులు చెప్పారు. ఇది చరిత్రాత్మకమని ఆమె బంధువు, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే) అధినేత టీటీవీ దినకరన్ ఉత్సాహపడ్డారు. ఇప్పుడు ఆయన కూడా శశికళ నిర్ణయంతో ఇరకాటంలో పడినట్టు కనబడుతోంది. ఆమె తాజా నిర్ణయాన్ని బీజేపీ పెద్దలు ప్రభావితం చేసివుండొచ్చన్న ఊహాగానాలు కొంతమేరకు నిజమే కావొచ్చు. ఆమెతో సర్దుబాటు చేసుకోవాలని ప్రతిపాదించినట్టు కూడా కథనాలొచ్చాయి. పళనిస్వామి, పన్నీరుసెల్వం ససేమిరా అన్నారని చెబుతున్నారు. శశికళ ప్రత్యక్ష రాజకీయానుభవం తక్కువే కావొచ్చుగానీ... ఆమె జయలలిత వద్ద చాలానే నేర్చుకున్నారు. సునిశిత పరిశీలననూ ఒంటబట్టించుకున్నారు. కనుక ఆమె వస్తానన్నా, రానన్నా ఆ మాటల వెనక పరమార్థం వుంటుంది. తాజాగా తమిళనాట డీఎంకే గాలి వీస్తున్నదని ఇప్పటికే వచ్చిన ఒకటి రెండు సర్వేలు నిర్ద్వంద్వంగా ప్రకటించాయి. రజనీకాంత్ వస్తానన్నప్పుడు డీఎంకేకు ఏమేరకు నష్టం జరగొచ్చునని అందరూ లెక్కలు వేశారు తప్ప రజనీ సీఎం అవుతారని ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు శశికళ రాక తర్వాత కూడా అంతే. ఆమె వల్ల నష్టం కలిగేది అన్నాడీఎంకే పార్టీకేనని తీర్మానించారు. ఆ పార్టీకి జరిగే నష్టమంతా శశికళకు లాభంగా మారదు. అది డీఎంకేకు తోడ్పడుతుంది. ఈమాత్రం దానికి ఇప్పుడు రాకపోతేనేం అని శశికళ ఆలోచించివుండొచ్చు. అయితే ఇదే ఆమె ఆఖరి నిర్ణయం అని చెప్పలేం. ఇప్పటికైతే ఇది విరామచిహ్నమే. ఆమె గత నిర్ణయాలే ఇందుకు ఉదాహరణ. 2011లో ఆమెను జయలలిత అన్నాడీఎంకేనుంచి బహిష్కరించినప్పుడు శశికళ క్షమాపణ చెప్పి, తనకు అక్కే(జయలలిత) ముఖ్యం తప్ప రాజకీయాలు కాదని ప్రకటించారు. మూడు నెలలు తిరక్కుండా మళ్లీ అధినేతకు చేరువయ్యారు. ఎన్నికల అనంతరం అన్నాడీఎంకే బలహీనపడిన పక్షంలో ఆమెకు అది సువర్ణావకాశమవుతుంది. అప్పటికి పళనిస్వామి, పన్నీరు సెల్వం ప్రభావం క్షీణిస్తుంది. ఇప్పుడు కాదన్నవారే శశికళకు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు. అందుకే వ్యూహాత్మకంగా ఆమె వెనక్కి తగ్గివుండొచ్చు. ఏదేమైనా మున్ముందు తమిళ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా వుంటాయి. -
మా సీఎం అభ్యర్థి కమలహాసన్
సాక్షి, చెన్నై: తమ కూటమి సీఎం అభ్యర్థిగా కమలహాసన్‌ను అంగీకరిస్తున్నట్టు ఎస్ఎంకే నేత శరత్‌కుమార్ తెలిపారు. కూటమి, అభ్యర్థుల ఎంపిక అధికారాన్ని శరత్‌కుమార్‌కు అప్పగిస్తూ ఎస్ఎంకే కార్యవర్గం బుధవారం తీర్మానించింది. సమత్తువ మక్కల్ కట్చి రాష్ట్ర కార్యవర్గం భేటీ తూత్తుకుడి జిల్లా ద్రవ్యపురంలో జరిగింది. అసెంబ్లీ ఎన్నికల కసరత్తులు, కూటమి ఏర్పాటు, అభ్యర్థుల ఎంపిక, వన్నియర్లకు 10.5 శాతం రిజర్వేషన్ల అమలతో ఎదురయ్యే నష్టాలు ఇతర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. శరత్‌కుమార్ మాట్లాడుతూ భావితరాల శ్రేయస్సును కాంక్షిస్తూ, త్యాగాలకు సిద్ధం కావాలని ఎస్ఎంకే కేడర్‌కు పిలుపునిచ్చారు. ఓటును నోటుతో కొనేయ వచ్చన్న ధీమాతో కొందరున్నారని, వారి ప్రలోభాలకు లొంగ వద్దు అని సూచించారు. లొంగిన పక్షంలో భావితరాలకు అష్టకష్టాలు తప్పవని ఆందోళన వ్యక్తంచేశారు. గతంలో ఈ పాలకులకు ప్రచారాలకు శరత్‌కుమార్ కావాల్సి వచ్చాడని, ఇప్పుడు శరత్‌కుమార్ అంటే ఎవరో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పాలకులకు గట్టిగా బుద్ధి చెప్పే రీతిలో ఈ ఎన్నికల్లో తన పయనం ఉంటుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సంపూర్ణ సహకారం అందించడమే కాదు, అభ్యర్థుల గెలుపునకు శ్రమించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ఐజేకే, మక్కల్ నీది మయ్యం వంటి పారీ్టలతో కలిసి కూటమిగా ఎస్ఎంకే ముందుకు సాగుతున్నదని ప్రకటించారు. ఈ కూటమి ఖరారైందని, ఈ కూటమి సీఎం అభ్యరి్థగా కమల్‌ను అంగీకరిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో రాధికా కూడా పోటీ చేయనున్నారని తెలిపారు. అది ఏ నియోజకవర్గం అన్న కూటమిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, అయితే, ఎస్ఎంకే 26 సీట్లలో తప్పకుండా పోటీ చేస్తుందని ప్రకటించారు. -
రజనీ సన్నిహితుడికి రోబో గుర్తు
సాక్షి, చెన్నై: రజనీకాంత్ సన్నిహితుడు అర్జునమూర్తికి ఎన్నికల చిహ్నంగా రోబో దక్కింది. ఇది ఎంతో ఆనందంగా ఉందని అర్జునమూర్తి వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీ ఏర్పాటు కసరత్తుల్లో భాగంగా అర్జునమూర్తికి కనీ్వనర్ పదవిని రజనీకాంత్ ఇచ్చిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో రాజకీయ పార్టీ ప్రకటనను రజనీ విరమించుకున్నారు. దీంతో అర్జునమూర్తి సొంత పార్టీని ప్రకటించుకున్నారు. ఇందుకు రజనీ సైతం ఆశీస్సులు అందించే రీతిలో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పరిస్థితుల్లో అర్జునమూర్తి ఏర్పాటు చేసిన ఇండియా మక్కల్ మున్నేట్ర కళగంకు ఎన్నికల కమిషన్ ఎన్నికల చిహ్నంగా రోబోను కేటాయించింది. రజనీకాంత్ నటించిన చిత్రం ‘రోబో’ ఇప్పటికే ప్రచారంలో ఉన్న దృష్ట్యా, తన పార్టీ చిహ్నాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం సులభతరం అని అర్జునమూర్తి ధీమా వ్యక్తం చేశారు. -
చిల్లర ఇచ్చి .. చుక్కలు చూపించాడు
అధికారి సహనానికి పరీక్ష రూ.10వేలకు రూ.10ల నాణేలు చెన్నై: ఓ స్వతంత్య్ర అభ్యర్థి సరదాగా ఒక ఎన్నికల అధికారి పని పట్టాడు. డిపాజిట్టు చెల్లింపులో అధికారి సహనానికి పరీక్షపెట్టాడు. ఇంతకూ సంగతి ఏమిటంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ ఘట్టం శుక్రవారం ఆరంభమైంది. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి డిపాజిట్టుగా రూ.10వేలు చెల్లించాల్సి ఉంది. చెన్నై విల్లివాక్కం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కందస్వామి షెనాయ్‌నగర్‌లోని ఎన్నికల కార్యాలయానికి వెళ్లారు. రూ.10వేల డిపాజిట్టు మొత్తాన్ని రూ.10 నాణేల రూపంలో తెచ్చారు. ఏడు కిలోలకు పైగా బరువున్న వంద నాణేలను ఎన్నికల అధికారి కుమారవేల్‌కు అందజేశారు. సదరు అధికారి తన సహాయక సిబ్బందికి ఆ నాణేలను సరిచూడాల్సిందిగా కోరారు. లెక్క సరిపోవడంతో నామినేషన్‌ను స్వీకరిం చి అభ్యర్థిని పంపివేశారు. అభ్యర్థి కందస్వామి మీడియాతో మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందుకే ఎన్నికల్లో పోటీచేస్తున్నాని, డిపాజిట్టు మొత్తం కోసం స్నేహితులు, బంధువులను ఆశ్రయించగా వారి ద్వారా అందిన నాణేలను అధికారికి సమర్పించానని తెలిపారు. అందండీ నాణేల వెనుక ఉన్న కథ.