రోబో కాప్..
రోబో కాప్..
ఈ రోబో ట్రాఫిక్ పోలీస్.. అంతేకాదు.. ట్రాఫిక్ సిగ్నల్ కూడా.. అంతేకాదు.. సీసీ కెమెరా కూడా.. కాంగోలోని కిన్‌షాసాలో ట్రాఫిక్ పోలీసుల స్థానంలో తాజాగా వీటిని ప్రవేశపెట్టారు. ఈ రోబో ట్రాఫిక్‌ను నియంత్రిస్తుంది. తన రెండు చేతులకున్న రెడ్, గ్రీన్ సిగ్నల్స్‌ను దీని కోసం ఉపయోగిస్తుంది. పోలీసులనే పట్టించుకోవడం లేదు.. రోబోను ఎవరు పట్టించుకుంటారు.. సిగ్నల్ జంప్ చేస్తేనో.. అని అడిగితే.. ఈ రోబో కళ్ల స్థానంలో నిఘా కెమెరాలు ఉన్నాయి. ఇలాంటివేవైనా జరిగితే వెంటనే అవి రికార్డ్ చేసి కంట్రోల్ రూంకు పంపిస్తాయి. దాని ఆధారంగా ట్రాఫిక్ పోలీసులు సదరు వాహన యజమానిపై కేసు బుక్ చేస్తారు. అదీ సంగతి.