
లాంగ్‌లాంగ్.. లోలాంగ్..
భారీ మొసలిని బంధించి, తరలిస్తున్న మగధీరుల్లా కనిపిస్తున్నారా మీకు వీరంతా.. అయితే, వీరికంత సీన్ లేదు లెండి.. ఎందుకంటే.. ఇది నిజమైన మొసలి కాదు కాబట్టి.. ఇదో రోబో.
భారీ మొసలిని బంధించి, తరలిస్తున్న మగధీరుల్లా కనిపిస్తున్నారా మీకు వీరంతా.. అయితే, వీరికంత సీన్ లేదు లెండి.. ఎందుకంటే.. ఇది నిజమైన మొసలి కాదు కాబట్టి.. ఇదో రోబో. చూడ్డానికి అచ్చంగా నిజమైన మొసలిని తలపిస్తూ.. దానిలాగే కదిలే ఈ రోబో మొసలి పేరు ‘లాంగ్‌లాంగ్’. పొడవు 21 అడుగులు.. దీన్ని రూ.లక్షకు పైగా ఖర్చు పెట్టి తయారుచేశారు. శనివారం లాంగ్‌లాంగ్‌ను ఫిలిప్పీన్స్‌లోని పాసే సిటీలో ఉన్న మొసళ్ల పార్కుకు తరలిస్తున్నప్పుడు తీసిన ఫొటో ఇదీ.
పార్కులో బోలెడన్ని ఒరిజినల్ మొసళ్లు ఉండగా.. ఈ డూప్లికేట్‌ను ఎందుకు తయారుచేయడం అని ప్రశ్నిస్తే.. ఇది నిజంగా ఒకప్పుడు కింగ్‌లా బతికిన ఓ భారీ మొసలి తాలూకు డూప్లికేటే అని చెప్పాల్సి వస్తుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఉప్పునీటి మొసలిగా(జూలో ఉన్నది) పేరొందిన ‘లోలాంగ్’ ఫిలిప్పీన్స్‌లోనే ఉండేది. గతేడాది అది చనిపోయింది. దీంతో దాని ప్లేసులో దీన్ని రీప్లేస్ చేస్తున్నారన్నమాట.