స్పైడర్‌మేన్ రోబో..! | Spider-Man robot to explore rocky planets | Sakshi
Sakshi News home page

స్పైడర్‌మేన్ రోబో..!

Published Tue, Jan 28 2014 4:24 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM

స్పైడర్‌మేన్ రోబో..!

స్పైడర్‌మేన్ రోబో..!

లండన్: గోడకు అమర్చిన ఎలక్ట్రానిక్ పరికరంలా కనిపిస్తున్న ఇది ఓ వినూత్న రోబో. సాలీడు మాదిరిగా దారపుపోగును విడుదల చేసి దాని ఆధారంగా గోడలను ఎగబాకడం, నిటారుగా దిగేయడం దీని ప్రత్యేకత. ప్రత్యేక థర్మోప్లాస్టిక్ పదార్థాన్ని వేడిచేసి ఇది ఓ గొట్టం ద్వారా వేగంగా వదులుతుంది. ఆ పదార్థం బయటికి వచ్చి గట్టిపడుతూ రాళ్లు, ఇతర ఉపరితలాలకు అతుక్కుని కడ్డీ మాదిరిగా మారుతుంది. దీనిని ఆధారం చేసుకుని చక్రాలతో ఉపరితలంపై జారుతూ ఈ రోబో కిందకు దిగుతుంది.
 
 ప్రస్తుతానికి నిటారు దారపు పోగులు (కడ్డీలు) మాత్రమే ఏర్పర్చి నిమిషానికి 12 సెం.మీ. మాత్రమే కిందికి దిగగలదు. భవిష్యత్తులో సమాంతర కడ్డీలు, సాలెగూడులా అల్లికలు ఏర్పర్చి ఎక్కువ బరువును మోస్తూ ఏ వైపు అయినా కదలగలిగేలా  కూడా దీనిని అభివృద్ధిపర్చనున్నట్లు స్విట్జర్లాండ్‌లోని బయో-ఇన్‌స్పైర్డ్ రోబోటిక్స్ ల్యాబ్ శాస్త్రవేత్తలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement