ఒకరికి ముగ్గురు! | sankar start robo 2 fastly | Sakshi
Sakshi News home page

ఒకరికి ముగ్గురు!

Published Thu, Feb 25 2016 10:45 PM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

ఒకరికి ముగ్గురు!

ఒకరికి ముగ్గురు!

డాక్టర్ వసీగరన్, చిట్టిగా ‘రోబో’లో రజనీకాంత్ చేసిన సందడి, ఐశ్వర్యా రాయ్ అభినయం, అందచందాలను అంత సులువుగా మర్చిపోలేం. శంకర్ క్రియేట్ చేసిన ఆ టెక్నికల్ వండర్‌కు సీక్వెల్‌గా ఇప్పుడు ‘2.0’ రూపొందుతున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హిందీ నటుడు అక్షయ్ కుమార్ విలన్ పాత్ర చేస్తున్నారు. తొలి భాగానికి మించిన విధంగా మలి భాగం ఉండాలనే పట్టుదలతో టేకింగ్ విషయంలో శంకర్ ఏమాత్రం రాజీపడడం లేదు. ఇక్కడి సాంకేతిక నిపుణులు మాత్రమే కాదు.. పలువురు హాలీవుడ్ నిపుణులు కూడా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

ముఖ్యంగా ఒకరికి ముగ్గురు స్టంట్ మాస్టర్స్‌ని పెట్టు కోవడం విశేషం. ఫైట్‌మాస్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘స్టన్’ శివ ‘2.0’లో థ్రిల్‌కి గురి చేసే ఫైట్స్ సమకూరుస్తున్నారట. అలాగే, ‘ట్రాన్స్‌ఫార్మర్స్’ ఫేమ్ అయిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఫైట్ మాస్టర్‌గా వ్యవహరిస్తు న్నారు. తాజాగా, హాలీవుడ్ నుంచి మరో స్టంట్ కో-ఆర్డినేటర్ ఈ చిత్రం కోసం ఇండియాకొచ్చారు. ఆయన పేరు ఆరోన్ క్రిప్పెన్. ‘ది డార్క్‌నైట్’, ‘బ్యాట్‌మన్ వర్సెస్ సూపర్‌మ్యాన్’ చిత్రాల ఫేమ్ అయిన ఆరోన్ ఇప్పుడీ ‘2.0’ షూటింగ్ లోకి ఎంటరయ్యారట. మొత్తానికి, ఒకరికి ముగ్గురు ఫైట్ మాస్టర్లు పని చేస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్‌లు మరెంత థ్రిల్‌కు గురి చేస్తాయో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement