మరోసారి అమెరికా వెళ్లిన రజనీకాంత్..? | Rajinikanth off to America for treatment | Sakshi
Sakshi News home page

మరోసారి అమెరికా వెళ్లిన రజనీకాంత్..?

Oct 20 2016 12:15 PM | Updated on Sep 4 2017 5:48 PM

మరోసారి అమెరికా వెళ్లిన రజనీకాంత్..?

మరోసారి అమెరికా వెళ్లిన రజనీకాంత్..?

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వల్లో నటిస్తున్న సంగతి తెలిసింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వల్లో నటిస్తున్న సంగతి తెలిసింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే టాకీ పార్ట్ షూటింగ్ పూర్తిచేసుకుంది. అదే జోరుతో సాంగ్స్ షూట్కు రెడీ అయిపోతున్నారు. ఈ సమయంలో ఓ షాకింగ్ న్యూస్ అభిమానులను కలవరపెడుతోంది.

రజనీకాంత్ మరోసారి మెడికల్ చెకప్స్ కోసం అమెరికా వెళ్లారట. పాటల షూటింగ్ కోసం ఉక్రేయిన్ వెళ్లాల్సి ఉండగా రజనీ సడన్గా అమెరికా వెల్లటం పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కబాలి రిలీజ్ సమయంలో కూడా రజనీ చాలా కాలం పాటు అమెరికాలోనే చికిత్స తీసుకున్నారు. కబాలి ప్రమోషన్లో కూడా పాల్గొనకుండా 40 రోజులకు పైగా అమెరికాలో ఉన్నారు. తాజాగా మరోసారి అమెరికా వెళ్లారంటూ వస్తున్న వార్తలపై ఫ్యాన్స్ కలవరపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement