
‘రాత’ను మార్చే రోబో..
కొందరి చేతిరాత చూస్తే.. ముద్దేస్తుంది.. మరికొందరికి చూస్తే.. మొత్తబుద్దేస్తుంది.. అందుకే చిన్నప్పటి నుంచే చేతిరాతపై అందరూ దృష్టిపెడతారు. ఇప్పుడా పనిని శాస్త్రవేత్తలు రోబోకు అప్పగించేశారు. ఇందుకోసం ఓ రోబో చేయిని తయారుచేసేశారు. బ్రిటన్‌కు చెందిన లీడ్స్ వర్సిటీ, అమెరికాకు చెందిన బ్రాడ్‌ఫోర్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియానాకు చెందిన పరిశోధకులు దీన్ని రూపొందించారు
లండన్: కొందరి చేతిరాత చూస్తే.. ముద్దేస్తుంది.. మరికొందరికి చూస్తే.. మొత్తబుద్దేస్తుంది.. అందుకే చిన్నప్పటి నుంచే చేతిరాతపై అందరూ దృష్టిపెడతారు. ఇప్పుడా పనిని శాస్త్రవేత్తలు రోబోకు అప్పగించేశారు. ఇందుకోసం ఓ రోబో చేయిని తయారుచేసేశారు. బ్రిటన్‌కు చెందిన లీడ్స్ వర్సిటీ, అమెరికాకు చెందిన బ్రాడ్‌ఫోర్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియానాకు చెందిన పరిశోధకులు దీన్ని రూపొందించారు. పిల్లలు రాసేటప్పుడు చేయి, మణికట్టు మధ్య సరైన సమన్వయం ఉండేలా ఇది చూస్తుంది. ఇదెలా పనిచేస్తుందంటే.. ఈ రోబోటిక్ చేయికి తగిలించి ఉండే.. పెన్‌ను పిల్లలు పట్టుకోవాలి. స్క్రీన్‌పై కనిపించే కంప్యూటర్ గేమ్స్‌కు అనుగుణంగా ఆ పెన్‌ను కదపాలి. ఈ సందర్భంగా వారేదైనా లోపాలు చేస్తున్నట్లు రోబో చేయి గుర్తిస్తే.. పెన్నును ముందుకు, వెనక్కు జరపడం ద్వారా సరిచేస్తుంది. దీన్ని ఇప్పటికే బ్రిటన్‌లోని ఓ స్కూల్లో పరీక్షించి చూశారు.
ముఖం లైట్‌లా వెలిగిపోతుంది..
ఫ్రూట్, చాక్లెట్ ఫేషియళ్ల టైం అయిపోయింది.. మార్కెట్లోకి మరో కొత్త రకం ఫేషియల్ వచ్చేసింది. పేరులోనే లైట్ ఉన్న ఈ థెరపీ చేయించుకుంటే.. ఇంట్లో లైట్ వేసుకోవాల్సిన పనిలేదని.. మన ముఖమే లైట్‌లా వెలిగిపోతుందని చెబుతున్నారు! విదేశాల్లో ప్రాచుర్యం పొందిన యురోపియన్ లైట్ థెరపీ(ఈఎల్‌టీ) ఫేషియల్స్ ఇప్పుడు మన ముఖారవిందాన్ని మరింత మెరుగులు దిద్దడానికి దేశంలో అడుగుపెట్టేశాయి. ఇందులో భాగంగా కాంతి శక్తిని శరీరంపై ప్రసరింపజేయడం ద్వారా దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ చేస్తారట. ఇందులో ఉండే నీలం రంగు కాంతి.. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడటంతోపాటు బ్లాక్ హెడ్స్ వంటివాటిని తొలగిస్తుంది. ఎర్ర లైట్ రక్తప్రసరణను మెరుగుపరచడంతోపాటు పిగ్మెంటేషన్‌కు చికిత్స చేస్తుంది. 45 నిమిషాల నుంచి గంటపాటు సాగే ఈ చికిత్సకు రూ.1,000 నుంచి రూ.3,500 వరకూ చార్జ్ చేస్తారు..