రోబో రాజ్యం సేవకులు.. | Robots are in our daily works | Sakshi
Sakshi News home page

రోబో రాజ్యం సేవకులు..

Published Sun, May 13 2018 2:12 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

Robots are in our daily works  - Sakshi

తెలివిలో రోబోలు మనిషిని మించిపోయే కాలం ఎప్పుడొస్తుందో తెలియదుగానీ.. పక్క ఫొటోలు చూస్తే అందుకు రంగం సిద్ధమవుతోందనే అనిపిస్తుంది. ఎందుకంటారా..? బోస్టన్‌ డైనమిక్స్‌ అనే అమెరికన్‌ కంపెనీ అభివృద్ధి చేసిన ఈ రోబోలు ఇంకో ఏడాదిలోపు అందరికీ అందుబాటులోకి రానున్నాయి.

పసుపు రంగులో కనిపిస్తున్న రోబో పేరు స్పాట్‌ ఐ. ఇళ్లలో, ఆఫీసుల్లో ఓ పెంపుడు జంతువు మాదిరి అటు ఇటూ తిరుగుతూ అవసరమైనప్పుడు తన ఒంటి చేత్తో వస్తువులను అమర్చిపెడుతుంది. ఇక చేతుల్లో ఓ కార్డ్‌బోర్డ్‌ పెట్టె.. కాళ్లకు చక్రాలు ఉన్న రోబో పేరు హ్యాండిల్‌! పేరుకు తగ్గట్టుగానే గోడౌన్లలో, లేదా ఈ– కామర్స్‌ స్టోర్లలో వస్తువులను అటు ఇటు కదిపేందుకు ఎంచక్కా ఉపయోగపడుతుంది. ఇక మిగిలినది రోబో పేరు అట్లాస్‌. ఈ మధ్య బాగా వార్తాల్లోకి ఎక్కిన రోబో ఇదే.

నిన్నమొన్నటిదాకా కర్రతో తోస్తూ.. దారిలో అడ్డంకులు సృష్టిస్తూ దీన్ని తెగ ఇబ్బంది పెట్టారు.అయినాసరే ఈ రోబో బ్యాలెన్స్‌ కోల్పోకుండా నిలబడగలిగింది. తాజాగా ఆఫీసు బయట ఎంచక్కా జాగింగ్‌ కూడా చేసేసింది. బోస్టన్‌ డైనమిక్స్‌ రోబోలు ప్రస్తుతానికి మిలటరీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవే. కానీ భవిష్యత్తులో ఈ రోబోలు ఇళ్లలోకి చేరడం ఖాయమని అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement