
ఉన్నట్టుండి ఆకాశంలో నుంచి ఒక మహా రాచ్చసుడు దిగి వచ్చి భూమి మీద నడుస్తుంటే, చూసే వాళ్లకు ఎంత బెదురుగా ఉంటుంది! ‘గుండం ఫ్యాక్టరీ’ దగ్గర కూడా అలాగే ఉంటుంది. జపాన్ ఇంజనీర్లు 65 అడుగుల ఎత్తు, 25 టన్నుల బరువు ఉన్న మహారోబోను తయారు చేశారు. ఈ ‘గుండం’ రోబోను రేవు పట్టణమైన యెకోహమ లోని చైనా టౌన్‌లో చూడవచ్చు. ఈ హ్యుమనాయిడ్ రోబో పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నడవడమే కాదు రెండు చేతులు చాస్తూ పర్యాటకులకు ఆహ్వానం పలుకుతుంది.
ఈ రోబో ఉన్న స్థలానికి ‘గుండం ఏరియా’ అని నామకరణం చేశారు. ఆశ్చర్యానందాలను సొంతం చేసుకోవడానికి మాత్రమే కాదు... ఇంజనీరింగ్ అద్భుతాన్ని తెలుసుకోవడానికి కూడా ఇక్కడికి రావచ్చు. కొత్త సంవత్సరంలో జపాన్ పర్యాటకరంగానికి మహా రోబో నూతన జవసత్వాలు ఇస్తుంది అంటున్నారు విశ్లేషకులు.
Comments
Please login to add a commentAdd a comment