రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. రుణ వినియోగదారులకు భారీ ఊరట నిచ్చేలా బుధవారం ఉత్తర్వులిచ్చింది. రుణగ్రహీత రుణం పూర్తిగా తిరిగి చెల్లించిన తర్వాత 30 రోజుల్లోగా ఏదైనా రిజిస్ట్రీలో నమోదైన ఛార్జీలను తొలగించాలని, అన్ని స్థిరాస్తి, చర ఆస్థి ఒరిజినల్ పత్రాలను విడుదల చేయాలని బ్యాంకులు , ఆర్థిక సంస్థలను బుధవారం ఆర్‌బీఐ ఆదేశించింది. అంతేకాదు జాప్యం జరిగిన పక్షంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులతో పాటు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, రూరల్ బ్యాంక్స్, సహకార బ్యాంకులకు సైతం ఈ ఆదేశాలు వర్తిస్తాయిని ఒక నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. (యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ : ప్రత్యర్థుల దారుణమైన ట్రోలింగ్ )
ఆర్‌బీఐ తాజా ఆదేశాల ప్రకారం ఆయా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు లోన్ చెల్లింపులు పూర్తయ్యాక ఫెయిర్ ప్రాక్టీస్ ప్రకారం 30 రోజుల్లోపు కస్టమర్లకు ఒరిజినల్ డాక్యుమెంట్లను తిరిగి అందించాల్సి ఉంటుంది. లేని పక్షంలో ప్రతిరోజుకూ రూ.5,000 పరిహారంగా చెల్లించాల్సిందేనని తాజా ఉత్తర్వుల్లో వెల్లడించింది. డిసెంబరు 1, 2023 తర్వాత చరాస్తులు/ స్థిరాస్తి పత్రాలను విడుదల చేసే అన్ని కేసులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది.(గోల్డ్ లవర్స్‌కి తీపి కబురు: బంగారం, వెండి ధరలు పతనం)
రుణ చెల్లింపులు పూర్తయ్యాక డాక్యుమెంట్లను ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు తిరిగి అందించటంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయన్న ఫిర్యాదుల మేరకు ఆర్‌బీఐ తాజా ఆదేశాలిచ్చింది. అలాగే చరాస్తులు/స్థిర ఆస్తి ఒరిజినల్ పత్రాల నష్టం/నష్టానికి సంబంధించి,ఆయా సంస్థలు, అటువంటి పత్రాల నకిలీ/సర్టిఫైడ్ కాపీలను పొందడంలో రుణ గ్రహీతకు సాయపడతాయని,, పరిహారం చెల్లించడంతో పాటు సంబంధిత ఖర్చులను భరిస్తాయని నోటిఫికేషన్ పేర్కొంది. అంతేకాదు ఇలాంటి సందర్బాల్లో ఈ విధానాన్ని పూర్తి చేయడానికి RE లకు 30 రోజుల అదనపు సమయం అందుబాటులో ఉంటుంది (అంటే, మొత్తం 60 రోజుల వ్యవధి తర్వాత) లెక్కించబడుతుందని కూడా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment