original documents
-
ఏపీ: జిరాక్సులు కాదు.. ఒరిజినల్ డాక్యుమెంట్లే ఇస్తున్నారు
సాక్షి, అమరావతి/అక్కిరెడ్డిపాలెం (గాజువాక): స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాక ఒరిజినల్ డాక్యుమెంట్లు కాకుండా జిరాక్సు కాపీలు మాత్రమే ఇస్తున్నారనే ప్రచారం పచ్చి అబద్ధమని తేలిపోయింది. రిజిస్ట్రేషన్లు చేయించుకున్న అనేక మంది తమకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒరిజినల్ డాక్యుమెంట్లే ఇస్తున్నారని చెబుతున్నారు. వారంతా ఒరిజినల్ డాక్యుమెంట్లను కూడా చూపిస్తున్నారు. ఈ–స్టాంపింగ్ ద్వారా జరిగే రిజిస్ట్రేషన్లకూ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇస్తున్నారని వినియోగదారులు తెలిపారు. పలుచోట్ల నాన్–జ్యుడీషియల్ స్టాంపు పేపర్లు అందుబాటులో ఉండటంతో అక్కడా రిజిస్ట్రేషన్లు చేసి గతంలో మాదిరిగానే ఒరిజినల్ డాక్యుమెంట్లు జారీ చేస్తున్నారు. ఆస్తి పత్రాలను ప్రభుత్వం వద్దే ఉంచుకుంటారనే ప్రచారం నిజం కాదని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న వారికి స్పష్టంగా తెలుస్తోంది. అనుమానాలు సృష్టిస్తున్న సోషల్ మీడియా ప్రచారం భూముల రిజిస్ట్రేషన్‌పై సోషల్ మీడియా, టీడీపీ ప్రచారం చేస్తున్న ఐవీఆర్ఎస్ కాల్స్ విన్న వారు మాత్రం అది నిజమేనని భ్రమపడుతున్నారు. అనుమానం ఉన్నవారు ఎవరైనా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళితే.. అక్కడ జరుగుతున్న రిజిస్ట్రేషన్ల తీరు, ఇస్తున్న డాక్యుమెంట్లు ఒరిజినల్సా, జిరాక్సులా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరో ముఖ్యాంశం ఏమిటంటే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు, ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి అసలు సంబంధమే లేదనే విషయం కూడా అక్కడికి వెళ్లిని వారికి అవగతమవుతోంది. ఎన్నికల నేపథ్యంలో కావాలని ప్రజల్లో అపోహలు సృష్టించడం కోసమే జిరాక్సుల ప్రచారం చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. భూ హక్కు చట్టంపై వదంతులు నమ్మొద్దు ఆస్తి తాలూకా ఒరిజనల్ డాక్యుమెంట్లను చూపుతున్న ఆర్.కృష్ణగాజువాక ప్రాంతానికి చెందిన ఈయన పేరు ఆర్.కృష్ణ. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎంఎస్సీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇటీవల గాజువాకలోని ఓ ఆస్తిని ఈయన కొనుగోలు చేశారు. గాజువాక జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బుధవారం తన ఆస్తికి సంబంధించిన ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పత్రాలను రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. ‘ల్యాండ్ టైట్లింగ్‌పై వస్తున్న వదంతులను, సోషల్ మీడియాలో ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని కొందరు వక్రీకరించడంపై అనుమానం వచ్చి సబ్ రిజిస్ట్రార్‌ను వివరణ కోరాను. ఆస్తి హక్కు పత్రాల ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చారా, జిరాక్స్ డాక్యుమెంట్లు ఇచ్చారా అని అడిగాను. ఈ వదంతులన్నీ అవాస్తవమని సబ్ రిజిస్ట్రార్ చెప్పారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఆస్తి హక్కుదారునైన నాకు ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అందజేశారు. సోషల్ మీడియాలో భూ హక్కు చట్టంపై వస్తున్న వదంతులన్నీ అవాస్తవాలే. వీటిని ఎవరూ నమ్మవద్దు’ అని చెప్పారు. ఈ విషయాలపై ఓ వీడియో కూడా విడుదల చేశారు.ఒరిజినల్సే ఇచ్చారు ఉయ్యూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్ కోసం వచ్చాను. రిజిస్ట్రేషన్ అయ్యాక ఒరిజనల్ దస్తావేజులు ఇచ్చారు. ఒరిజినల్స్ ఇవ్వడం లేదు, జిరాక్స్ కాపీలు ఇస్తున్నారంటూ కొన్ని టీవీల్లో వస్తున్న వార్తలు నిజం కాదు. – తాతినేని రామ్మోహనరావు, గోపువానిపాలెం, పమిడిముక్కల మండలం, కృష్ణా జిల్లా ఆ ప్రచారం నిజం కాదు నా తల్లితో కలిసి ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం వచ్చాను. పావు గంటలో రిజ్రస్టేషన్ చేశారు. వెంటనే డాక్యుమెంట్ ఇచ్చారు. రిజిస్ట్రార్ ఆఫీసులో డాక్యుమెంట్ ఇవ్వడం లేదని బయట జరుగుతున్న ప్రచారం నిజం కాదు. మా చేతికి ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చారు. – ప్రసాద్, చింతలపూడి, ఏలూరు జిల్లాఒరిజినల్ తీసుకున్నాను నేను భీమునిపట్నం రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో స్థలం కొన్నాను. రిజిస్ట్రేషన్ కోసం వెళితే వెంటనే పూర్తి చేశారు. సబ్ రిజిస్ట్రార్‌ను కలిసి కొత్త విధానంలో డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని చెబుతున్నారని అడిగాను. అది అబద్ధమని చెప్పారు. వెంటనే నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చారు. – శ్రీకాంత్, భీమిలి, విశాఖ జిల్లా -
ఒరిజినల్ డాక్యుమెంట్లు తనిఖీ చేశాకే మ్యుటేషన్లు
సాక్షి, అమరావతి: మ్యుటేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. భూములకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను తనిఖీ చేశాకే మ్యుటేషన్లు చేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. జిరాక్స్, ట్రూ కాపీలు, ఇతర అనధికారిక పత్రాల ఆధారంగా మ్యుటేషన్లు చేయవద్దని స్పష్టం చేసింది. వీటివల్ల వివాదాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలిచ్చింది. ఒరిజినల్ డాక్యుమెంట్లను తహసీల్దార్లు ధృవీకరించాలని చెప్పింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగానికి భూ పరిపాలన ప్రధాన కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ సర్క్యులర్ జారీ చేశారు. తహశీల్దార్లు ప్రతి మ్యుటేషన్‌కు తప్పనిసరిగా సేల్ డీడ్ వంటి ఒరిజినల్ డాక్యుమెంట్లు, వాటి ఒరిజినల్ లింకు డాక్యుమెంట్లు, ఒరిజినల్ ఈసీతోపాటు దానికి సంబంధించిన ఇతర అధికారిక పత్రాలను పరిశీలించాలని స్పష్టం చేశారు. ఒరిజినల్ డాక్యుమెంట్లను పరిశీలించినట్లు తహసీల్దార్ ఆన్లైన్లో ధృవీకరించాలని (సర్టిఫై చేయాలి) ఆదేశించారు. రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్ నుంచి ఆన్లైన్లో చూసే డాక్యుమెంట్లు తప్ప ఇతర ఏ సందర్భంలోనైనా ఈ విధానం పాటించాల్సిందేనని చెప్పారు. ఇండియన్ ఎవిడెన్స్ చట్టం ప్రకారం ఒరిజినల్ డాక్యుమెంట్లని ధృవీకరించకుండా చేసిన ఎలాంటి మ్యుటేషన్ లేదా ఆర్డర్ ఆమోదయోగ్యం కాదని తెలిపారు. రాష్ట్రంలో పలుచోట్ల తహశీల్దార్లు ఫొటో కాపీల ఆధారంగా మ్యుటేషన్లు చేయడం, అసలైన యజమానులు ఫిర్యాదుతో అవి సరైన పత్రాలు కావని నిర్థారణ అయిన నేపథ్యంలో హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. దీంతో సీసీఎల్ఏ ఈ ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ శాఖలోని చివరి వ్యక్తి నుంచి అన్ని స్థాయిల్లో ఈ నిబంధనలు పాటించాలని, దీనికి విరుద్ధంగా ఎవరైనా ఫొటో కాపీలు చూసి మ్యుటేషన్లు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. యాక్ట్ 15 ఆఫ్ 2022 ప్రకారం క్రిమినల్ లా కింద ఎవరైనా ఆర్ఓఆర్ చట్టానికి విరుద్ధంగా ఆర్డర్లు ఇస్తే వారిని జిల్లా కలెక్టర్లు విచారించే అధికారం ఉందని తెలిపారు. -
డాక్యుమెంట్లు తిరిగి ఇవ్వకపోతే రోజుకు రూ. 5 వేల పరిహారం
న్యూఢిల్లీ: రుణం పూర్తి చెల్లింపుల తర్వాత రుణానికి సంబంధించి తనఖాగా ఉంచిన ఒరిజినల్ స్థిర లేదా చర ఆస్తి పత్రాలు అన్నింటినీ రుణగ్రహీతకు 30 రోజుల లోపు తిరిగి ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) బ్యాంకులకు, ఫైనాన్స్ సంస్థలకు స్పష్టం చేసింది. ఏదైనా ఆలస్యం జరిగితే రోజుకు రూ. 5 వేలు పరిహారంగా చెల్లించాలని స్పష్టం చేసింది. అదేవిధంగా ఏదైనా రిజిస్ట్రీలో నమోదైన చార్జీలను అన్నింటినీ నిర్దేశిత 30 రోజుల్లో తీసివేయాలని కూడా ఒక నోటిఫికేషన్లో ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ తరహా పలు ఫిర్యాదుల నమోదు నేపథ్యంలో బ్యాంకింగ్ రెగ్యులేటర్ తాజా ఆదేశాలు ఇచి్చంది. డాక్యుమెంట్లు తిరిగి ఇవ్వడంలో నెల రోజులు దాటితే ఈ జాప్యానికి స్పష్టమైన కారణాలను రుణగ్రహీతకు తెలియజేయాల్సి ఉంటుందని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వడానికి సంబంధించిన విధివిధానాల వివరాలను బ్యాంకింగ్ లేదా ఆర్థిక సంస్థలు తమ తమ వెబ్సైట్లో ఉంచాలని సూచించింది. నష్టం జరిగితే.. మరో 30 రోజులు ఒరిజినల్ చర లేదా స్థిర ఆస్తి పత్రాలు కనబడకుండా పోవడం లేదా ఏదైనా నష్టం జరిగితే అటువంటి పత్రాల డూప్లికేట్ లేదా సరి్టఫైడ్ కాపీలను పొందడంలో రుణగ్రహీతకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పూర్తిగా సహాయపడాలని కూడా ఆర్బీఐ నిర్దేశించింది. ఇందుకు మరో 30 రోజుల సమయాన్ని తీసుకోవచ్చని పేర్కొంది. ఆ తర్వాతే (60 రోజుల తర్వాత) జాప్యానికి రోజుకు రూ.5 వేల పరిహారం నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. కాగా, ఈ పరిహారం... ఇతర ఏదైనా (వర్తించే) చట్టం ప్రకారం ఏదైనా ఇతర పరిహారం పొందేందుకు రుణగ్రహీత కు ఉండే హక్కులకు ఎటువంటి భంగం కలిగించబోదని ఆర్బీఐ స్పష్టం చేయడం గమనార్హం. 2023 డిసెంబరు 1 తర్వాత ఒరిజినల్ చర లేదా స్థిరాస్తి పత్రాలను విడుదల చేసే అన్ని కేసులకు ఈ తాజా ఆదేశాలు వర్తిస్తాయని ఆర్బీఐ తెలిపింది. -
రుణగ్రహీతలకు భారీ ఊరట: ఆర్బీఐ కీలక ఆదేశాలు
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. రుణ వినియోగదారులకు భారీ ఊరట నిచ్చేలా బుధవారం ఉత్తర్వులిచ్చింది. రుణగ్రహీత రుణం పూర్తిగా తిరిగి చెల్లించిన తర్వాత 30 రోజుల్లోగా ఏదైనా రిజిస్ట్రీలో నమోదైన ఛార్జీలను తొలగించాలని, అన్ని స్థిరాస్తి, చర ఆస్థి ఒరిజినల్ పత్రాలను విడుదల చేయాలని బ్యాంకులు , ఆర్థిక సంస్థలను బుధవారం ఆర్బీఐ ఆదేశించింది. అంతేకాదు జాప్యం జరిగిన పక్షంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులతో పాటు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, రూరల్ బ్యాంక్స్, సహకార బ్యాంకులకు సైతం ఈ ఆదేశాలు వర్తిస్తాయిని ఒక నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. (యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ : ప్రత్యర్థుల దారుణమైన ట్రోలింగ్ ) ఆర్బీఐ తాజా ఆదేశాల ప్రకారం ఆయా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు లోన్ చెల్లింపులు పూర్తయ్యాక ఫెయిర్ ప్రాక్టీస్ ప్రకారం 30 రోజుల్లోపు కస్టమర్లకు ఒరిజినల్ డాక్యుమెంట్లను తిరిగి అందించాల్సి ఉంటుంది. లేని పక్షంలో ప్రతిరోజుకూ రూ.5,000 పరిహారంగా చెల్లించాల్సిందేనని తాజా ఉత్తర్వుల్లో వెల్లడించింది. డిసెంబరు 1, 2023 తర్వాత చరాస్తులు/ స్థిరాస్తి పత్రాలను విడుదల చేసే అన్ని కేసులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది.(గోల్డ్ లవర్స్‌కి తీపి కబురు: బంగారం, వెండి ధరలు పతనం) రుణ చెల్లింపులు పూర్తయ్యాక డాక్యుమెంట్లను ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు తిరిగి అందించటంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయన్న ఫిర్యాదుల మేరకు ఆర్బీఐ తాజా ఆదేశాలిచ్చింది. అలాగే చరాస్తులు/స్థిర ఆస్తి ఒరిజినల్ పత్రాల నష్టం/నష్టానికి సంబంధించి,ఆయా సంస్థలు, అటువంటి పత్రాల నకిలీ/సర్టిఫైడ్ కాపీలను పొందడంలో రుణ గ్రహీతకు సాయపడతాయని,, పరిహారం చెల్లించడంతో పాటు సంబంధిత ఖర్చులను భరిస్తాయని నోటిఫికేషన్ పేర్కొంది. అంతేకాదు ఇలాంటి సందర్బాల్లో ఈ విధానాన్ని పూర్తి చేయడానికి RE లకు 30 రోజుల అదనపు సమయం అందుబాటులో ఉంటుంది (అంటే, మొత్తం 60 రోజుల వ్యవధి తర్వాత) లెక్కించబడుతుందని కూడా తెలిపింది. -
విద్యార్థిని వేధించిన బ్యాంకుపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, అమరావతి: విద్యారుణం కోసం దరఖాస్తు చేసే సమయంలో ఓ విద్యార్థి సమర్పించిన ఆస్తి ఒరిజినల్ డాక్యుమెంట్లను అతడికి తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఇది ఆ విద్యార్థిని వేధించడమేనన్న హైకోర్టు.. ఇందుకు బ్యాంకు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఆ విద్యార్థికి ఖర్చుల కింద రూ.25 వేలు చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది. ఆ మొత్తాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో 15 రోజుల్లో హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడిషియల్) వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో తమ ఆదేశాల అమలుకు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ ఇటీవల తీర్పు చెప్పారు. ఇదీ పిటిషన్.. మచిలీపట్నానికి చెందిన విద్యార్థి నిశ్చల్.. విద్యారుణం కోసం ఆంధ్రాబ్యాంకుకు (తరువాత ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైంది) దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుతో అవసరమైన డాక్యుమెంట్లను, అతడి తల్లి ఇచ్చిన ఆస్తి ఒరిజినల్ గిఫ్ట్ డీడ్‌ను బ్యాంకు అధికారులకు సమర్పించారు. అయితే కొల్లేటరల్ సెక్యూరిటీకి సంబంధించిన ఒరిజినల్ డీడ్‌ను సమర్పించలేదంటూ నిశ్చల్‌కు రుణం మంజూరు చేసేందుకు బ్యాంకు అధికారులు నిరాకరించారు. దీంతో నిశ్చల్ తాను సమర్పించిన ఒరిజినల్ గిఫ్ట్ డీడ్‌ను తిరిగి ఇచ్చేయాలని బ్యాంకు అధికారులను కోరారు. దీనికి బ్యాంకు అధికారులు సానుకూలంగా స్పందించలేదు. తమకు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవ్వలేదని చెప్పారు. దీంతో నిశ్చల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ తిల్హరీ విచారించారు. ఒరిజినల్ డీడ్‌ను ఇచ్చేస్తాం.. నిశ్చల్ న్యాయవాది శిఖరం కృష్ణమోహన్ వాదనలు వినిపిస్తూ.. దరఖాస్తుతో పాటు ఒరిజినల్ గిఫ్ట్ డీడ్‌ను సమర్పించినప్పటికీ బ్యాంకు అధికారులు ఇవ్వలేదంటూ చెప్పడం దారుణమన్నారు. దరఖాస్తుతో పాటు ఒరిజినల్ డీడ్‌ను సమర్పించామంటూ అందుకు సంబంధించిన ఆధారాలను ఆయన కోర్టు ముందుంచారు. ఈ సమయంలో బ్యాంకు న్యాయవాది వి.ద్యుమని పూర్తివివరాలను తెలుసుకుని కోర్టు ముందుంచేందుకు గడువు కోరారు. ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. తిరిగి ఇటీవల ఈ వ్యాజ్యం విచారణకు రాగా.. ద్యుమని స్పందిస్తూ దరఖాస్తుతో పాటు పిటిషనర్ ఒరిజినల్ డీడ్‌ను సమర్పించారని తెలిపారు. వాటిని తిరిగి ఇచ్చేందుకు బ్యాంకు సిద్ధంగా ఉందన్నారు. ఆ డీడ్ ద్వారా తనఖాపెట్టిన ఆస్తిని 15 రోజుల్లో విడిపిస్తామని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బ్యాంకు తీరును తప్పుపట్టారు. ఇది పిటిషనర్‌ను వేధించడమేనన్నారు. అందుకే పిటిషనర్ మరో గత్యంతరం లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. ఇందుకుగానూ రూ.25 వేలను ఖర్చుల కింద పిటిషనర్‌కు చెల్లించాలని బ్యాంకును ఆదేశించారు. -
వైద్య విద్యార్థులకు ధ్రువపత్రాల తలనొప్పి
సాక్షి, హైదరాబాద్: ‘నీట్’లో మెరిట్ ర్యాంకు సాధించిన రాష్ట్ర విద్యార్థులు సమస్యల వలయంలో చిక్కుకున్నారు. రాష్ట్రస్థాయిలో దరఖాస్తు చేసుకోవడానికి ముందే అఖిల భారత కోటా సీట్లకు మొదటి విడత కౌన్సిలింగ్ నిర్వహించారు. అందులో కొందరు తెలంగాణ విద్యార్థులు సీట్లు సాధించారు. గడువు సమీపించడంలో వివిధ రాష్ట్రాల్లోని వైద్య కాలేజీల్లో ఫీజులు చెల్లించి చేరిపోయారు. అటువంటి మెరిట్ విద్యార్థులు తెలంగాణలో సీటు పొందలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కౌన్సిలింగ్‌కు హాజరయ్యే పరిస్థితి వారికి లేకుండా పోయింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఒరిజినల్స్ ఇవ్వకపోవడంతో ఇక్కడి కౌన్సిలింగ్లో పాల్గొనలేని పరిస్థితి నెలకొంది. ఒరిజినల్స్ మాత్రమే వెరిఫికేషన్‌కు ఇవ్వాలని, ఎక్కడో కాలేజీలో చేరినట్లుగా కస్టోడియన్ సర్టిఫికెట్ ఇస్తే అనుమతి ఇవ్వలేమని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నిబంధన విధించడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అఖిల భారత కోటాలో మొదటి విడత ప్రవేశాల్లో కాలేజీలో చేరడానికి ఈనెల మూడో తేదీతో గడువు ముగిసిపోయింది. అఖిల భారత కోటాలో తొలి విడత ప్రవేశ ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి తెలంగాణలో అసలు సర్టిఫికెట్ల వెరిఫికేషనే ప్రారంభం కాలేదు. దీంతో ఇతర రాష్ట్రాల్లో అఖిల భారత కోటాలో చేరాల్సి వచ్చింది. అక్కడ సర్టిఫికెట్లు ఉండిపోవడంతో ఇక్కడ సమర్పించలేకపోయారు. దీంతో ఇక్కడ స్థానికులైనా మొదటి విడతలో కనీసం పోటీ పడడానికి కూడా అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో స్థానికంగా సీట్లు పొందలేక, తప్పని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లోనే కొనసాగాల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కస్టోడియన్ సర్టిఫికెట్లకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కస్టోడియన్ సర్టిఫికెట్లను అనుమతించబోమని ముందే నిర్ణయం తీసుకున్నామని విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వాస్తవంగా ఈనెల మూడో తేదీ నాటికి అఖిల భారత సీట్లలో చేరడానికి గడువుందని, కానీ మన రాష్ట్రంలో మొదటి విడతకు సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ గత నెల 30వ తేదీ వరకుందని ఆయన పేర్కొన్నారు. 7 నుంచి 9 వరకు వెబ్ ఆప్షన్లు.. మొదటి విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈనెల ఏడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు జరుగుతుందని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. పదో తేదీన ఎవరెవరికి ఎక్కడ సీటు వచ్చిందో జాబితా విడుదల చేస్తామన్నారు. -
ఒరిజినల్స్ తనిఖీ తర్వాతే పాన్
న్యూఢిల్లీ: శాశ్వత ఖాతా నంబర్ (పాన్) నిబంధనలను కేంద్ర ఆర్థిక శాఖ కఠినతరం చేసింది. పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసే సమయంలోనే ఒరిజినల్ పత్రాలు కూడా పరిశీలిస్తారు. ఈ విషయాన్ని ఆదాయపు పన్నుల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ శాఖ చెప్పిన మరిన్ని వివరాలు.. దరఖాస్తు చేసే సమయంలో వయసు, చిరునామా ధ్రువీకరణ పత్రాలతో పాటు గుర్తింపు కార్డును పాన్ కేంద్రాలకు తీసుకురావాలి. దరఖాస్తుతో పాటు సమర్పించిన జిరాక్సు కాపీలతో ఒరిజినల్ పత్రాలను పరిశీలించి అక్కడికక్కడే వెనక్కి తిరిగి ఇచ్చేస్తారు. ఈ మార్పు ఫిబ్రవరి 3 నుంచి అమల్లోకి వస్తుంది. కాగా, పాన్ కార్డు పొందడానికి ఆయా కేంద్రాల్లో 85 రూపాయలతో పాటు సర్వీస్ ట్యాక్స్ కలిపి నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. -
నగరంలో భూమి కొనుగోలు చేస్తున్నారా ?
వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ : వరంగల్ అర్బన్ పరిధిలోని భూములకు డిమాండ్ పెరగడంతో వాటి రేట్లు అధికమయ్యాయి. విలువతోపాటు వివాదాలు కొనుగోలుదారులను వెంటాడుతున్నాయి. కొంతమంది భూకబ్జాదారులు భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లోని లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుని తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి వాటి ద్వారా అసలు భూయజమానులను భయపెడుతున్నారు. తద్వారా నగరంలో భూసమస్యలు అధికమవుతుండడంతో భూములు, ఇంటి స్థలాలు కొనుగోలు చే సే ప్రజలకు అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర్రావు పలుసూచనలు చేశారు. సాధారణంగా ప్రజలు భూమి కొనుగోలు విషయంలో నకిలీ డాక్యుమెంట్లు, భూములను తనఖా పెట్టడం, ఒకే భూమిని ఇద్దరు లేక ముగ్గురికి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడం, అనుమతి లేని లేఅవుట్స్ స్థలాలను కొనుగోలు చేయడం, ఒకే భూమిని ఇద్దరు, ముగ్గురు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడం, ఆక్రమణలకు లాంటి మోసాలకు గురవుతున్నారు. భూములు, ఇంటి స్థలాల కొనుగోలు చేసే ప్రజలు ముందుగా పరిశీలించవలసిన పత్రాల వివరాలను తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. ముఖ్యంగా ప్రజలు పరిశీలించాల్సిన పత్రాలు ఒరిజనల్ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఆ భూమి, ప్లాట్ యాజమాన్య హక్కులు ఎవరి పేరు మీద ఉన్నాయో స్థానిక తహసీల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయం ద్వారా యాజమాన్య హక్కు పత్రాలు పొందాలి. తాము కొనుగోలు చేసే భూములు ప్రభుత్వానికి చెందినదా, బూదాన్, వ్యవసాయ భూములా అనే విషయాన్ని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ధ్రువీకరించుకోవాలి. తహసీల్దార్ కార్యాలయం నుంచి పహణీ కాపీలు(1956 నుంచి), కాసార కాపీలు, పట్టా పాస్‌బుక్, టైటిల్ వివరాల కాపీలను పొందాలి. కొనుగోలు చేసే భూములు ఆక్రమణకు గురయ్యాయా, తనఖా పెట్టారా, ఏమైనా కోర్టు కేసులు ఉన్నాయో తెలుసుకోవాలి. భూమికి సంబంధించి కొనుగోలు సమయంలో సరైన స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. కొనుగోలు చేసిన భూములను వెంటనే తమ ఆధీనంలోకి తీసుకోవడంతోపాటు పాస్‌బుక్ లేదా ఒరిజనల్ డాక్యుమెంట్లను అమ్మకందారుడి నుంచి స్వాధీనం చేసుకోవాలి. ఆ భూమికి సంబంధించి ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా అంటూ స్థానిక పత్రికల్లో ప్రకటన ఇవ్వాలి. ఒరిజనల్ డాక్యుమెంట్లపై నల్ల సిరాతో కూడిన రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ముద్రలు అచ్చువేయబడి ఉంటాయి. బ్లూ రంగుతో కూడిన సేల్ డీడ్, స్టాంపులు చెల్లవు. నోటరీ డాక్యుమెంట్లు చట్టప్రకారం చెల్లవు. భూమికి సంబంధించి ట్రాన్సఫర్ రుసుం, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ దాఖలు చెల్లించినది.. లేనిది గుర్తించాలి. సాధ్యమైనంత వరకు భూములు, ఇంటి స్థలాల అమ్మకందారుడి వివరాలను విచారించి కొనుగోలు చేయాలి. ఏమైనా మోసం జరిగినట్లు తెలిస్తే స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతోపాటు సంబంధిత పత్రాలతో కోర్టును సకాలంలో ఆశ్రయించాలి.