ఒరిజినల్స్ తనిఖీ తర్వాతే పాన్ | Government Tightens PAN card application, allotment rules | Sakshi
Sakshi News home page

ఒరిజినల్స్ తనిఖీ తర్వాతే పాన్

Published Sat, Jan 25 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM

ఒరిజినల్స్ తనిఖీ తర్వాతే పాన్

ఒరిజినల్స్ తనిఖీ తర్వాతే పాన్

న్యూఢిల్లీ: శాశ్వత ఖాతా నంబర్ (పాన్) నిబంధనలను కేంద్ర ఆర్థిక శాఖ కఠినతరం చేసింది. పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసే సమయంలోనే ఒరిజినల్ పత్రాలు కూడా పరిశీలిస్తారు. ఈ విషయాన్ని ఆదాయపు పన్నుల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ శాఖ చెప్పిన మరిన్ని వివరాలు..
     దరఖాస్తు చేసే సమయంలో వయసు, చిరునామా ధ్రువీకరణ పత్రాలతో పాటు గుర్తింపు కార్డును పాన్ కేంద్రాలకు తీసుకురావాలి.
     దరఖాస్తుతో పాటు సమర్పించిన జిరాక్సు కాపీలతో ఒరిజినల్ పత్రాలను పరిశీలించి అక్కడికక్కడే వెనక్కి తిరిగి ఇచ్చేస్తారు.
     ఈ మార్పు ఫిబ్రవరి 3 నుంచి అమల్లోకి వస్తుంది.  కాగా, పాన్ కార్డు పొందడానికి ఆయా కేంద్రాల్లో 85 రూపాయలతో పాటు సర్వీస్ ట్యాక్స్ కలిపి నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement