లోన్స్ అందించే సమయంలో రుణగ్రహీతలకు వడ్డీరేట్లను వెల్లడించడానికి సంబంధించిన నిబంధనలను పాటించడంలో ముంబైలోని మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ విఫలమైంది. నియమాలను అతిక్రమించినందుకు గాను రిజర్వ్ బ్యాంక్ రూ. 6.77 కోట్ల జరిమానా విధించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
కెవైసి (Know Your Customer) నిబంధనలను ఉల్లంఘించినందుకుగానూ ఇండియన్ బ్యాంక్‌పై రూ. 55 లక్షలు జరిమానా విధించినట్లు కూడా రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా తెలిపింది. అంతే కాకూండా 2016లో మోసాల పర్యవేక్షణలోని కొన్ని నిబంధనలను పాటించనందుకు ఎర్నాకులంలోని ముత్తూట్ మనీ లిమిటెడ్‌పై రూ. 10.50 లక్షల జరిమానా విధించడం జరిగింది.
(ఇదీ చదవండి: అనంత్ అంబానీ ధరించిన వాచ్ స్పెషలేంటో తెలుసా? ఎన్ని కోట్లు ఉంటుందంటే..?)
పెనాల్టీలనేవి రెగ్యులేటరీ సమ్మతిలోని లోపాలపై ఆధారపడి ఉంటాయి. కస్టమర్లతో వారు కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం చెల్లుబాటుపై ఉచ్ఛరించడానికి ఉద్దేశించినది కాదని RBI స్పష్టం చేసింది. మహీంద్రా & మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్‌పై చట్టబద్ధమైన తనిఖీ 2019 మార్చి 31 & 2020 మార్చి 31 నాటికి దాని ఆర్థిక స్థితికి సంబంధించింది.
(ఇదీ చదవండి: మహీంద్రా కార్లపై కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్! థార్ కొనుగోలుపై ఏకంగా..)
రుణాల కోసం పారదర్శక విధానాలకు సంబంధించి కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిన సందర్భాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గుర్తించినట్లు తెలిపింది. నిజానికి రుణాలను మంజూరు చేసేటప్పుడు రుణగ్రహీతలకు విధించే వార్షిక వడ్డీ రేట్లను వెల్లడించడంలో కంపెనీ విఫలమైంది. రుణగ్రహీతలకు వారి రుణాల నిబంధనలు, షరతులకు మార్పులు చేసినప్పుడు వారికి తెలియజేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment