
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్‌పై ఐపీఎల్ గవర్వింగ్ కౌన్సిల్ రూ. 24 లక్షల జరిమానా విధించింది. విశాఖపట్నంలో బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు బౌలర్లు నిర్ణీత సమయంలో కనీస ఓవర్ల కోటా పూర్తి చేయలేదు. ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టు రెండోసారి స్లో ఓవర్‌రేట్ నమోదు చేసింది.