రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఓలా ఫైనాన్షియల్ సర్వీస్‌కు పెనాల్టీ విధించింది. ఆర్బీఐ రెగ్యులటరీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందనే కారణంతో ఆర్బీఐ.. ఓలాకు రూ.1,67,80,000 (రూ.1.67 కోట్లు) ఫైన్ విధించింది.
ఆర్బీఐ అధికారిక ప్రకటన ప్రకారం..ఆగస్ట్ 25, 2021లో జారీ చేసిన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్(పీపీఐఎస్) తో పాటు.. బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు చేసే, చేసిన లావాదేవీలపై బోర్డు ఆమోదం తప్పని సరి చేస్తూ ఆర్బీఐ తెచ్చిన పాలసీ (మాస్టర్ డైరెక్షన్) కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 25,2016 లలో జారీ చేసిన కేవైసీలపై ఆర్బీఐ పైన పేర్కొన్నట్లుగా భారీ మొత్తంలో జరిమానా విధించింది.
మార్గ దర్శకాల్ని పాటించనందు వల్ల పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 సెక్షన్ 30 కింద ఆర్‌బీఐ ఈ పెనాల్టీని విధించినట్లు తెలిపింది. అయితే ఆర్బీఐ విధించిన జరిమానాను ఓలా వ్యతిరేకిస్తే..అందుకు కారణాల్ని వెల్లడించాలని పేర్కొంది. సంస్థ స్పందనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత.. ఆర్‌బీఐ ఈ పెనాల్టీని విధించాలని నిర్ణయించినట్టు సమాచారం.\
Comments
Please login to add a commentAdd a comment