Norms violation
-
ఆంక్షలను ధిక్కరిస్తూ.. లో దుస్తులతో నిరసన
టెహ్రాన్: బహిరంగంగా మహిళల వేషధారణపై కఠిన నిబంధనలు, కట్టుబాట్లను అమలుచేస్తున్న ఇరాన్లో ఓ విద్యార్థిని నిరసన గళం విప్పారు. ముఖం కనిపించకుండా సంప్రదాయ వస్త్రం ధరించలేదన్న కారణంగా టెహ్రాన్‌లో ఆ విద్యార్థినిపై బసీజ్ పారామిలటరీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. టెహ్రాన్‌లోని ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీ ఇందుకు వేదికైంది. వాగ్వాదంలో బసీజ్ పారామిలటరీ సభ్యులు ఆ వర్సిటీ విద్యార్థిని దుస్తులు చింపేశారు. దీంతో ఆగ్రహంతో ఆ అమ్మాయి చిరిగిన బట్టలు పక్కన పడేసి లోదుస్తుల్లో తన నిరసన వ్యక్తంచేసింది. విద్యార్థినులపై కఠిన మత చట్టాలను అమలుచేయడమేంటని నిలదీసింది. అలాగే లోదుస్తుల్లో వందలాది విద్యార్థినీవిద్యార్థుల మధ్యలో వర్సిటీ ప్రాంగణంలో కలియ తిరిగింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసింది. దీంతో సాధారణ దుస్తుల్లో వచి్చన పోలీసులు ఆమెను వెంటనే అరెస్ట్ చేసి కారులో కుక్కి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. దీంతో ఆమె ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇరాన్ సంస్థ స్పందించింది. ‘‘ ఆమె ప్రస్తుతం ఎక్కడుందో ఎవరికీ తెలీదు. బేషరతుగా విద్యార్థిని తక్షణం విడుదలచేయాలి. ఆమెను పోలీసులు కొట్టడం, వేధించడం చేయొద్దు. కుటుంసభ్యులు, లాయర్‌తో మాట్లాడే అవకాశం కల్పించాలి. పారదర్శకంగా దర్యాప్తు చేపట్టాలి’’ అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇరాన్ డిమాండ్ చేసింది. హిజాబ్ ధరించలేదంటూ మాసా అమినీ అనే యువతిని నైతిక పోలీసులు చిత్రవధ చేసి చంపడం, అది ఇరాన్లో భారీ నిరసనలకు దారితీయడం తెలిసిందే. -
ఓలా ఫైనాన్షియల్ సర్వీస్‌కు ఆర్బీఐ భారీ జరిమానా!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఓలా ఫైనాన్షియల్ సర్వీస్‌కు పెనాల్టీ విధించింది. ఆర్బీఐ రెగ్యులటరీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందనే కారణంతో ఆర్బీఐ.. ఓలాకు రూ.1,67,80,000 (రూ.1.67 కోట్లు) ఫైన్ విధించింది. ఆర్బీఐ అధికారిక ప్రకటన ప్రకారం..ఆగస్ట్ 25, 2021లో జారీ చేసిన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్(పీపీఐఎస్) తో పాటు.. బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు చేసే, చేసిన లావాదేవీలపై బోర్డు ఆమోదం తప్పని సరి చేస్తూ ఆర్బీఐ తెచ్చిన పాలసీ (మాస్టర్ డైరెక్షన్) కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 25,2016 లలో జారీ చేసిన కేవైసీలపై ఆర్బీఐ పైన పేర్కొన్నట్లుగా భారీ మొత్తంలో జరిమానా విధించింది. మార్గ దర్శకాల్ని పాటించనందు వల్ల పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 సెక్షన్ 30 కింద ఆర్బీఐ ఈ పెనాల్టీని విధించినట్లు తెలిపింది. అయితే ఆర్బీఐ విధించిన జరిమానాను ఓలా వ్యతిరేకిస్తే..అందుకు కారణాల్ని వెల్లడించాలని పేర్కొంది. సంస్థ స్పందనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత.. ఆర్బీఐ ఈ పెనాల్టీని విధించాలని నిర్ణయించినట్టు సమాచారం.\ -
వైరల్: మాస్కులు లేకుండా గుంపులుగా జలకాలాటలు
కోవిడ్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో అనేక పర్యాటక ప్రదేశాలు సుదీర్ఘ కాలంగా మూసివేసిన విషయం తెలిసిందే. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ పర్యాటక ప్రాంతాలు సందడిగా మారుతున్నాయి. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పోటెత్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పర్వత ప్రాంతాలైన ముస్సోరి, నైనిటాల్‌కు సందర్శకుల తాకిడి పెరిగింది. స్థానిక హోటళ్లన్నీ నిండిపోయాయి. వీధుల్లో వాహనాల రద్దీ అధికంగా ఉంది. అయితే కరోనా నిబంధనలను విస్మరించి ప్రజలు పెద్దఎత్తున పర్వతప్రాంతాల వద్ద కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ముస్సోరిలోని కెంప్టీ వాటర్‌ఫాల్స్ వద్ద వందలాది మంది పర్యాటకులు గుంపులు గుంపులుగా మాస్క్ లేకుండా స్నానం చేస్తున్న వీడియో బుధవారం నెట్టింట్లో వైరలవుతోంది. వీడియోలో ఒక్కరూ కూడా మాస్క్ ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా కనిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో వీడియోపైన నెటిజన్లు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఎమ్టీ బ్రెన్ ఇన్ కెంప్టీ’(కెంప్టీలో మెదడు లేని వాళ్లు) అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ గుంపులను చూస్తుంటే భయమేస్తుందంటున్నారు. కాగా ముస్సొరీలో, కుల్ది బజార్, మాల్ రోడ్ వంటి ప్రదేశాలు తరచుగా రద్దీగా మారుతున్నాయి.. పర్యాటకుల సంఖ్య పెరగడంతో నైనిటాల్‌లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి తలెత్తింది. ఉత్తరాఖండ్‌తో పాటు, కోవిడ్ నిబంధనలు సడలించిన తరువాత ఐదు లక్షలకు పైగా పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్‌కు తరలివచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ నగరాలు, హిల్ స్టేషన్లలోనే కాకుండా దేశంలో చాలా చోట్ల పరిస్థితి ఇలాగే ఉంది. ప్రజలు మాస్కులు ధరించకుండా.. భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. కోవిడ్ కేసులు తగ్గుతున్నప్పటికీ ఈ నిబంధనలను పాటించాలని కేంద్రం పదేపదే చెబుతోంది. -
మాటల కోసమేనా మహిళలు..?
న్యూఢిల్లీ: మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి.. స్త్రీలను పురుషులతో సమానంగా చూడాలని చెప్పే పెద్దలు తీరా తమ వంతు వచ్చేసరికి ఆ విషయాన్ని మరుస్తున్నారు. సాక్ష్యాత్తు దేశంలోని మార్కెట్ పెట్టుబడుల ఒడిదుడుకులను సమతుల్యం చేసే సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్సైంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొన్ని సంస్థలు వాటిని పాటిస్తున్నా మరికొన్ని మాత్రం ఆ ఆదేశాలు తుంగలో తొక్కుతూ బేఖాతరు చేస్తున్నాయి. దాదాపు దేశంలోని 56 బడా కంపెనీలు సెబీ గీసిన గీతను దాటుతున్నాయి. ప్రతి కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో కనీసం ఒక మహిళకు స్థానం ఇవ్వాలని కంపెనీ యాక్ట్ 2013కు 2014లో సవరణ చేసింది. ఏడాదిలోగా ప్రతి కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒక మహిళకు చోటు ఇవ్వాలని ఆదేశించింది. ఒక వేళ అలా చేయకుంటే రూ.50 వేల ఫైన్ తో ఆరు నెలల గడువు, అది చేయకుంటే రోజుకు రూ.వెయ్యి, అప్పటికీ పూర్తి చేయకుంటే రూ.లక్షా 43 వేల జరిమానాతోపాటు, ప్రతి రోజు ఐదువేలు చెల్లించాలని అందులో పేర్కొంది. ఇది కూడా అమలుచేయకుంటే ప్రమోటర్లతో పాటు డైరక్టర్ల మీద కూడా చర్యలు చేపడతామని హెచ్చరించింది. అయినప్పటికీ, మహిళలకు తమ సంస్థల్లో ప్రాధాన్యం కల్పించకుండా దేశ వ్యాప్తంగా 56 కంపెనీలు ఇప్పటికీ కొనసాగుతుండటం గమనార్హం. ఆ కంపెనీల్లో.. టాటా పవర్, ఆల్ స్టామ్ ఇండియా, రాష్ట్రాల సారథ్యంలో నడిచే ఓఎన్జీసీ, గెయిల్, బీఈఎమ్ఎల్, బీపీసీఎల్, హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్, హెచ్ఎంటీ, ఐఓసీ, ఎమ్ఎమ్టీసీ, నేషనల్ ఫెర్టిలైజర్స్, పవర్ ఫినాన్స్ కార్పొరేషన్, సిండికేట్ బ్యాంక్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, ఒరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్, మద్రాస్ ఫెర్టిలైజర్స్ లాంటి ప్రభుత్వ సంస్థలు, లాన్కో ఇన్ఫ్రాటెక్, డీబీ కార్సో, వలేకా ఇంజనీరింగ్, సెర్వలక్ష్మీ పేపర్, సలోరా ఇంటర్నేషనల్ లాంటివి ఉన్నాయి.