ఇన్ఫోసిస్‌కు ఎదురుదెబ్బ.. తప్పు చిన్నదైనా తప్పని జరిమానా! | Infosys Fined By Seattle Finance Administrative Services | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్‌కు ఎదురుదెబ్బ.. తప్పు చిన్నదైనా తప్పని జరిమానా!

Published Thu, Sep 7 2023 6:25 PM | Last Updated on Thu, Sep 7 2023 8:55 PM

Infosys Fined By Seattle Finance Administrative Services - Sakshi

Infosys Fined: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ (Infosys)కు ఎదురుదెబ్బ తగిలింది. యూఎస్‌ఏలోని సీటెల్ ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (Seattle Finance Administrative Services) నుంచి తమకు 1,764.84 డాలర్లు జరిమానా విధించినట్లు ఇన్ఫోసిస్ తాజాగా ప్రకటించింది. 

(Google: ప్రభుత్వ ఉద్యోగులకు గూగుల్‌ బంపరాఫర్‌..)

2021 జనవరి 1 నుంచి 2022 డిసెంబర్ 31 మధ్య కాలానికి స్థానిక పేరోల్ పన్నును ట్యాక్స్ అథారిటీకి తక్కువగా చెల్లించినందుకు గానూ జరిమానా విధించినట్లు ఇన్ఫోసిస్‌ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలియజేసింది. దీని వల్ల కంపెనీ ఆర్థిక విషయాలు, నిర్వహణ, ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండదని పేర్కొంది.

గతంలోనూ..  
పన్ను చెల్లింపులో లోటు కారణంగా గత నెలలో కూడా ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవిన్యూ నుంచి పెనాల్టీని ఎదుర్కొంది. ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ అప్పట్లో 76.92 డాలర్ల పెనాల్టీని వసూలు చేసింది. కాగా పొరపాటున అధిక పన్ను రేటు కోసం దరఖాస్తు చేసుకున్నామని, ఈ విషయంలో ముందుకు ఎలా వెళ్లాలో పరిశీలిస్తున్నామని ఇన్ఫోసిస్‌ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement