దక్షిణాఫ్రికాలోని ఎస్‌బీఐ శాఖపై ఆ దేశ కేంద్ర బ్యాంక్ ప్రుడెన్షియల్ అథారిటీ చర్యలు చేపట్టింది. తమ దేశ మనీలాండరింగ్ నిరోధక చట్టాలను ఉల్లంఘించినందుకు ఎస్‌బీఐపై పరిపాలనాపరమైన ఆంక్షలు, జరిమానా విధించింది.
సౌత్ ఆఫ్రికా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ చట్టంలోని కొన్ని నిబంధనలను పాటించనందుకు గానూ తమపై 10 మిలియన్ ర్యాండ్ (రూ.4.5 కోట్లు) జరిమానా విధించినట్లు ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన ఒక ప్రకటనలో ఎస్‌బీఐ తెలిపింది.
దక్షిణాఫ్రికా సెంట్రల్ బ్యాంక్ తమపై విధించిన జరిమానాలో 5.5 మిలియన్ ర్యాండ్లు (రూ.2.5 కోట్లు) వెంటనే చెల్లించాల్సి ఉండగా మరో 4.5 మిలియన్ ర్యాండ్లు (రూ.2 కోట్లు) 36 నెలల్లో చెల్లించేందుకు వీలుందని ఎఎస్‌ఐ తెలిపింది. వీటిలో 5.5 మిలియన్ ర్యాండ్ల జరిమానాను ఎస్‌బీఐ చెల్లించింది. 4.5 మిలియన్ ర్యాండ్ల మొత్తాన్ని నిర్ణీత గడువులోగా చెల్లిస్తామని బ్యాంక్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment