ప్రైవేట్ రంగానికి చెందిన యస్ బ్యాంక్ తమిళనాడు వస్తు సేవల పన్ను (GST) విభాగం భారీ పెనాల్టీ విధించింది. జీఎస్టీ సంబంధిత సమస్యల కారణంగా తమిళనాడు జీఎస్టీ విభాగం నుంచి రూ.3 కోట్ల పన్ను నోటీసును యస్ బ్యాంక్ సోమవారం అందుకుంది.
యస్ బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. తమిళనాడు జీఎస్టీ డిపార్ట్‌మెంట్ రూ. 3,01,50,149 జరిమానా విధించింది. అయితే దీని వల్ల బ్యాంక్ ఆర్థిక లేదా ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండదని, దీనిపై న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు యస్ బ్యాంక్ పేర్కొంది.
ఇదీ చదవండి: వామ్మో.. కొత్త ఏడాదిలో బంగారం కొనగలమా? కలవరపెడుతున్న అంచనాలు!
కాగా యస్ బ్యాంక్ గతంలోనూ జీఎస్టీ నోటీసులు అందుకుంది. గతేడాది డిసెంబర్‌లో బిహార్ జీఎస్టీ డిపార్ట్‌మెంట్ వరుసగా రూ. 20,000, రూ. 1,38,584 చొప్పున రెండు వేర్వేరు పన్ను నోటీసులను జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment