డిజిటల్ పేమెంట్‌తో పాటు ఈ-కామర్స్, ఫైనాన్స్ రంగంలో ఉన్న పేటీఎంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ షాక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(PPBL)కు కోటి రూపాయల పెనాల్టీ విధించింది.
పేమెంట్ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007కు విరుద్దంగా వ్యవహరించిందన్న ఆరోపణలపై ఆర్బీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ మేరకు నిజమని తేలడంతో పేటీఎంకు భారీ జరిమానా విధిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది ఆర్బీఐ. ఆథరైజేషన్ సర్టిఫికెట్ కోసం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పెట్టుకున్న అప్లికేషన్ సమాచారం సక్రమంగా లేదని సెంట్రల్ బ్యాంక్(ఆర్బీఐ) పెనాల్టీ విధించడానికి గల కారణాన్ని వెల్లడించింది. పీఎస్‌ఎస్ యాక్ట్ సెక్షన్ 26(2) ప్రకారం.. ఇది నేరమని పేర్కొంది ఆర్బీఐ.
అంతేకాదు చెల్లింపుల పరిమితి నిబంధనను ఉల్లంఘించినందుకు(2019-2020 మధ్య చెల్లింపులకు సంబంధించి) వెస్ట్రన్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు సైతం 27 లక్షల రూపాయల జరిమానా విధించింది ఆర్బీఐ.
హాట్ న్యూస్: నువ్వేం తోపు కాదు.. ఫేస్‌బుక్‌కు 520 కోట్ల జరిమానా
Comments
Please login to add a commentAdd a comment