ఆ బ్యాంకులపై కొరడా ఝులిపించిన ఆర్బీఐ! | Rbi Imposes Rs 12 Lakh Fine For Violating Banking Norms On 6 Co Operative Banks | Sakshi
Sakshi News home page

ఆ బ్యాంకులపై కొరడా ఝులిపించిన ఆర్బీఐ!

Published Tue, Nov 15 2022 12:07 PM | Last Updated on Tue, Nov 15 2022 1:09 PM

Rbi Imposes Rs 12 Lakh Fine For Violating Banking Norms On 6 Co Operative Banks - Sakshi

వివిధ బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పలు బ్యాంకులపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)  దాదాపు ₹12 లక్షల జరిమానా విధించింది. అందులో ఆరు సహకార బ్యాంకులు, మూడు సహకారి బ్యాంకులతో కలిపి తొమ్మిది సంస్థలపై విధించినట్లు ఆర్‌బిఐ ప్రకటించింది.

ఆ బ్యాంకులపై కొరడా
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఎల్లప్పుడూ వాటి పనితీరు, కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలో నిబంధనలు పాటించని బ్యాంకులపై కొరడా ఝులిపిస్తోంది. తాజాగా తొమ్మిది బ్యాంకులపై ఫైన్‌ విధించినట్లు ప్రకటనలో తెలిపింది. వివరాల ప్రకారం.. బెర్హంపూర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ (ఒడిశా) ₹3.10 లక్షలు, ఉస్మానాబాద్ జనతా సహకరి బ్యాంక్, ఉస్మానాబాద్ (మహారాష్ట్ర) ₹2.5 లక్షలు, మహిసాగర్ జిల్లాలోని సంత్రంపూర్ (గుజరాత్)లోని శాంత్రంపూర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ₹2 లక్షల జరిమానా విధించింది.

జిల్లా సహకరి కేంద్రీయ బ్యాంక్ మర్యాదిట్, బాలాఘాట్ (మధ్యప్రదేశ్); జంషెడ్‌పూర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, జంషెడ్‌పూర్, జార్ఖండ్; రేణుకా నాగరిక్ సహకారి బ్యాంక్ మర్యాదిట్, అంబికాపూర్ (ఛత్తీస్‌గఢ్) ఒక్కొక్కరికి ₹1 లక్ష జరిమానా విధించగా,  కృష్ణ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, భోపాల్ (మధ్యప్రదేశ్), కేంద్రపారా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కేంద్రపారా, ఒడిశాకు ఒక్కొక్కరికి ₹50,000 జరిమానా, నవానగర్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, జామ్‌నగర్ (గుజరాత్) ₹25,000 జరిమానా విధించినట్లు పేర్కొంది.

చదవండి: కేం‍ద్రం భారీ షాక్‌: పది లక్షల రేషన్‌ కార్డులు రద్దు, కారణం ఏంటంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement